Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పతాగి ఓ వ్యక్తిపై దాడి: బెన్ స్టోక్స్ అరెస్ట్, రాత్రంతా జైల్లో

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం ఎలాంటి చార్జ్‌ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం వెస్టిండీస్‌తో జరిగే నాలుగో వన్డేలో వీరిద్దరూ ఆడడం లేదు. ఈ ఘటన జరిగిన సమయంలో స్టోక్స్‌తో పాటు అక్కడే ఉన్న మరో క్రికెటర్ అలెక్స్‌ హేల్స్‌ను కూడా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు.. బుధవారం విండీస్‌తో నాలుగో వన్డే నుంచి వీరిద్దరిని సస్పెండ్‌ చేసింది.

ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. పబ్‌లో తప్పతాగి ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచాడన్నది స్టోక్స్‌పై ప్రధాన ఆరోపణ. వెస్టిండిస్‌తో మూడో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత బ్రిస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

స్టోక్స్‌ దాడి చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలు

స్టోక్స్‌ దాడి చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలు

స్టోక్స్‌ దాడి చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సోమర్సెట్‌ పోలీసులు వెల్లడించారు. 'బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపించాం. ఈ ఘటనకు కారకుడిగా భావిస్తూ ఒక 26 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్‌ చేశాం. ప్రస్తుతం బెన్ స్టోక్స్‌ని విడుదల చేసినా విచారణ మున్ముందు కొనసాగుతుంది' అని పోలీసులు వెల్లడించారు.

బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో

బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో

వెస్టిండీస్‌తో మూడో మ్యాచ్‌ జరిగిన తర్వాత బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌కి బెన్‌స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌ వెళ్లారు. ఆ రాత్రి అక్కడ ఓ వ్యక్తితో గొడవ జరిగింది. రోడ్డుపై ముఖంపై గాయాల పాలై రోడ్డుమీద పడున్న వ్యక్తిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అతడి సమాచారం మేరకు స్టోక్స్‌ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత ఎలాంటి చార్జ్‌ లేకుండా వదిలేశారు.

నేరం రుజువైతే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష

నేరం రుజువైతే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష

ఈ కేసులో నేరం రుజువైతే బెన్ స్టోక్స్‌కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్‌ కోచింగ్‌ క్యాంప్‌కు హాజరు కాలేదంటూ ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ వీరిద్దరిని బుధవారం జరిగే నాలుగో వన్డే నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.

ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు

ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు

అయితే స్టోక్స్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2012లో తప్పతాగి రాత్రంతా గొడవ చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి హెచ్చరికతో వదిలి పెట్టారు. 2014లో మత్తులో లాకర్‌పై పిడిగుద్దులు గుద్ది చేతిని గాయపర్చుకున్నాడు. ఈ కారణం చేత టి20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+