తప్పతాగి నడిరోడ్డుపై గొడవ: బెన్ స్టోక్స్‌పై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సస్పెన్షన్ వేటు వేసింది.
గత ఆదివారం విండిస్‌తో మూడో వన్డేలో విజయానంతరం తోటి ఆటగాడు అలెక్స్ హేల్స్‌తో కలిసి స్టోక్స్ బ్రిస్టల్‌లోని ఓ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకున్నాడు. ఆ క్లబ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో స్టోక్స్ ఆ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించడంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మరుసటిరోజు ఉదయం విడుదల
స్టోక్స్‌తోపాటు హేల్స్‌ను అరెస్టు చేసి ఆ రాత్రంతా జైల్లో
దీంతో పోలీసులు స్టోక్స్‌తోపాటు హేల్స్‌ను అరెస్టు చేసి ఆ రాత్రంతా జైల్లో ఉంచి, మరుసటిరోజు ఉదయం విచారణ అనంతరం స్టోక్స్ పై కేసు నమోదు చేయకుండా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, నైట్ క్లబ్ బయట సదరు వ్యక్తిని స్టోక్స్ చితకబాదుతున్న వీడియోని గురువారం బ్రిటిష్ పత్రిక సన్ న్యూస్ విడుదల చేసింది.

ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి
స్టోక్స్ నిమిషంలో పదిహేను పంచ్‌లు
అందులో స్టోక్స్ నిమిషంలో పదిహేను పంచ్‌లు విసిరాడు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘర్షణ లో స్టోక్స్ చేతికి గాయం కూడా అయింది. ఈ సాక్ష్యం కారణంగా పోలీస్ విచారణలో కూడా స్టోక్స్ దోషిగా తేలే అవకాశాలు ఉన్నాయి.

బెన్ స్టోక్స్‌పై కఠిన చర్యలు
స్టోక్స్‌తో పాటు అలెక్స్ హేల్స్‌పై కూడా సస్పెన్షన్
మరోవైపు ఆ వీడియోని చూసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బెన్ స్టోక్స్‌పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న స్టోక్స్.. నిర్దోషిగా రుజువయ్యేంత వరకు అతన్ని జాతీయ జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. స్టోక్స్‌తో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అలెక్స్ హేల్స్‌కు కూడా ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ఈసీబీ ప్రకటించింది.

యాషెస్ సిరీస్‌కు ఎంపిక
యాషెస్ సిరీస్‌కు ఎంపికైన బెన్ స్టోక్స్
బ్రిస్టల్ వీధిలో మద్యం మత్తులో గొడవపడి చేతికి గాయం చేసుకున్నప్పటికీ.. సిరీస్ సమయానికి కోలుకుంటాడన్న నమ్మకంతో సెలెక్టర్లు అతడిని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఐతే గొడవకు సంబంధించిన వీడియో బయటపడటం.. దాంట్లో స్టోక్స్ విచక్షణారహితంగా దాడి చేయడం వెలుగులోకి రావడంతో అతడిపై ఈసీబీ చర్యలు తీసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications