For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దురదృష్టవంతుడు: ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు రనౌట్లే!

Ben McDermott keen to end run of outs

హైదరాబాద్: క్రికెట్‌లో ప్రత్యర్ధి జట్టుపై విజయం సాధించాలంటే క్యాచ్‌లతో పాటు రనౌట్లు ఎంతో కీలకం. రనౌట్లు కారణంగా మ్యాచ్ ఫలితాలే మారిపోతుంటాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెటర్ తాను ఆడిన తొలి నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరడం విశేషం.

ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా రనౌట్లు

ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా రనౌట్లు

ఆ క్రికెటర్ పేరు బెన్ మెక్డోర్మోట్. వయసు 23 ఏళ్లు. ఆస్ట్రేలియా మాజీ టెస్టు క్రికెటర్ క్రైగ్ మెక్డోర్మోట్ కుమారుడు. ఇటీవలే యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మూడు టీ20ల్లోనూ బెన్ మెక్డోర్మోట్ రనౌటయ్యాడు.

బెన్ రనౌట్లపై సోషల్ మీడియాలో జోకులు

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యనటలో భాగంగా శనివారం దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా XI జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా XI జట్టు తరుపున బరిలోకి దిగిన బెన్ మెక్డోర్మోట్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో బెన్ రనౌట్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

 రనౌట్లపై దృష్టి సారించాలి

రనౌట్లపై దృష్టి సారించాలి

ఈ క్రమంలో బెన్ మాట్లాడుతూ "జోకులు తర్వాత... వికెట్ల మధ్య పరిగెత్తడంపై నేను తప్పక దృష్టిసారించాలి. ఉపఖండంలో జరిగిన టీ20 టోర్నీలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొని అంతకముందు ఎప్పుడూ ఆడలేదు. ఇదొక అద్భుతమైన అనుభవం" అని పేర్కొన్నాడు.

వన్డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు

వన్డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు

ఆస్ట్రేలియాలో జరిగే వన్డే కప్‌లో క్రిస్ లిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బెన్ నిలిచాడు. ఈ ఏడాది బెన్ 71.16 యావరేజితో 90 స్ట్రయిక్ రేట్‌తో 427 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక, బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Wednesday, November 14, 2018, 13:50 [IST]
Other articles published on Nov 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+