For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇద్దరు క్యాచ్ పట్టి బ్రావో వికెట్ పడగొట్టారు (వీడియో)

Ben Laughlin helps Jake Weatherald pull off one of the great cricket catches

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ క్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. అది ఎలాంటిదంటే ఒక్క క్యాచ్‌ను ఇద్దరూ కలిసి ప్రత్యర్థి జట్టుకు చెందిన కీలక వికెట్‌ను పడగొట్టారు. టోర్నీలో భాగంగా ఆడిలైట్‌ -మెల్‌బోర్న్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి పట్టిన క్యాచ్‌ ఇప్పుడు బిగ్‌బాష్‌ లీగ్‌లోనే బెస్ట్‌ క్యాచ్‌గా నిలిచింది.

టోర్నీలో భాగంగా మెల్‌బోర్న్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిలైట్‌ జట్టు 26 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆడిలైట్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల విజయ లక్ష్యంతో మెల్‌బోర్న్‌ బరిలోకి దిగింది. రషీద్‌ ఖాన్‌ వేసిన 16వ ఓవర్లో రెండో బంతికి డ్వేన్‌ బ్రావో(4) ఔటయ్యాడు. రషీద్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న బ్రావో దాన్ని గాల్లోకి లేపాడు.

బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తోన్న బెన్‌ లాగ్లిన్‌ చిరుతలా దూసుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బంతితో పాటు బౌండరీ లైన్‌ దాటబోయాడు. వెంటనే తన చేతిలోని బంతిని సమీపంలో ఉన్న వెదర్లాండ్‌ వైపు విసిరాడు. వెదర్లాండ్‌ దాన్ని ఒడిసిపట్టడంతో బ్రావో(4) మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

ప్రస్తుతం లాగ్లిన్‌-వెదర్లాండ్‌ కలిసి అద్భుతంగా క్యాచ్‌ పట్టిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇదే బెస్ట్‌ క్యాచ్‌ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 15:56 [IST]
Other articles published on Jan 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+