Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం పట్టాడు భయ్యా!.. ఈ క్యాచ్ చూస్తే మతిపోవాల్సిందే..(వీడియో)

Ben Foakes Catch Video: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ అద్భుతమైన క్యాచ్‌ను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ అద్భుతమైన క్యాచ్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో యార్క్‌షైర్ వర్సెస్ సర్రే మ్యాచ్‌లో కనిపించింది. ఈ బెస్ట్ క్యాచ్‌ను వికెట్ కీపర్ బెన్ ఫాక్స్ పట్టాడు. ఈ క్యాచ్ పట్టుకోవడం ద్వారా బెన్ ఫాక్స్ అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అద్భుతమైన క్యాచ్ పట్టిన బెన్ ఫాక్స్
ఆ మ్యాచ్‌లో సర్రే తరఫున టామ్ లాడ్జ్ ఇన్నింగ్స్‌లోని 33వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ చివరి బంతికి యార్క్‌షైర్ బ్యాటర్ జోనాథన్ టాటర్సాల్ లెగ్ సైడ్‌లో పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత బంతి గాల్లోకి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బెన్ ఫాక్స్ చాలా దూరం పరిగెత్తి డైవింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇది ఏ ఆటగాడికి కూడా సాధ్యం కాని క్యాచ్. ఈ అద్భుతమైన క్యాచ్ చూసి ఆటగాళ్లందరూ ఆశ్చర్యపోయారు. దీని తర్వాత బ్యాటర్ జోనాథన్ కూడా నిరాశతో పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు.

Ben Foakes Stunning Catch A Jaw-Dropping Moment in County Cricket

యార్క్ షైర్ తరఫున 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జోనాథన్ టాటర్సాల్ 38 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అంతకు ముందు టాస్ గెలిచిన తర్వాత యార్క్‌షైర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 255 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో యార్క్‌షైర్ తరఫున జానీ బెయిర్‌స్టో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో 114 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి.

ఆట ముగిసే సమయానికి 48 పరుగులు చేసిన సర్రే
దీని తర్వాత 256 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సర్రే జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. సర్రే తరఫున కెప్టెన్ రోరీ బర్న్స్ 27 పరుగులతో,డొమినిక్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Story first published: Saturday, May 17, 2025, 12:35 [IST]
Other articles published on May 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+