Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs ENG: ఫైనల్‌లో భారత్ ను ఓడిస్తామని చెప్పావుగా.. ఇప్పుడేమైంది?

AFG vs ENG: ఇంగ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో ఊహించని ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం చాడ్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.

ఇదిలా ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ లో మూడు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ ఓటమి తర్వాత బెన్ డకెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ మాట్లాడుతూ.. "మేము 3-0 తేడాతో ఓడినా పెద్ద విషయమేమీ కాదు. మేము ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఛాంపియన్స్ ట్రోఫీపైనే మా ఫోకస్ అంతా. మేము ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. వారిని ఓడించడం ద్వారా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం." అని బెన్ డకెట్ అన్నాడు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్ నుంచి నిష్క్రమించింది.

Ben Duckett s Bold Prediction on India in the Final Backfires After England s Early Exit

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో నెటిజన్లు డకెట్ వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్నారు. ఫైనల్ లో భారత్ ను ఓడిస్తామని చెప్పావుగా.. ఇప్పుడేమైంది అంటూ ఆటపట్టిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు కేవలం మాటలే మాట్లాడుతుందని.. మైదానంలో విఫలమవుతుందని చాలా మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దూకుడుగా ఆడటం అనే పేరుతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవుతోందని అభిమానులు విమర్శిస్తున్నారు.

Story first published: Thursday, February 27, 2025, 10:18 [IST]
Other articles published on Feb 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+