ఒకే ఇంట్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు.. జింబాబ్వేకు ఆడనున్న బెన్ కరన్!
తన కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న నాలుగో వ్యక్తిగా బెన్ కరన్ నిలవనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో స్టార్ ప్లేయర్లు అయిన సామ్ కరన్-టామ్ కరన్ సోదరుడే బెన్ కరన్. అయితే తన బ్రదర్స్‌లా ఇంగ్లండ్‌కు కాకుండా జింబాబ్వే తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే జట్టుకు ఎంపికయ్యాడు.
బెన్ కరన్ తండ్రి కెవిన్ కరన్ జింబాబ్వే తరఫున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. 11 వన్డేలు ఆడిన కెవిన్ 287 పరుగులు, 9 వికెట్లు ఆడాడు. కాగా, తండ్రి కెవిన్ కరన్ అడుగుజాడల్లో నడిచి ముగ్గురు కుమారులు ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎదగడం విశేషం. 28 ఏళ్ల బెన్ కరన్ ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్. కుడిచేతితో ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 34.70 సగటుతో 2429 పరుగులు చేశాడు. 36 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 999 పరుగులు చేశాడు.

కాగా, జింబాబ్వే పర్యటనలో అఫ్గానిస్థాన్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ప్రకటించిన జింబాబ్వే జట్టులో బెన్ కరన్‌కు ఎంపిక కాలేదు. వన్డే సిరీస్‌కు మాత్రమే సెలక్ట్ అయ్యాడు. దేశవాళీలో రాణిస్తున్న బెన్ కరన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కించుకున్నాడు. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మరుమని, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమాన్
జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కరన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మరుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్, విక్టర్ న్యౌచి, సికిందర్ రజా, సీన్ విలియమ్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications