Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఎడమ చేత్తో ఆడ‌తాడంటా?: ఐపీఎల్ వెబ్‌సైట్‌లో ఇలా

హైదరాబాద్: భుజం నొప్పి గాయంతో ఐపీఎల్ పదో సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనంత మాత్రాన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఐపీఎల్‌ మర్చిపోయినట్లుంది. కోహ్లీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మ‌న్ మనందరికీ తెలిసిందే.

కానీ, ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విరాట్‌ కోహ్లీ కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌ అనడానికి బదులు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ అని ఉండటం విశేషం. ఇంత పెద్ద త‌ప్పును కూడా ఐపీఎల్ నిర్వాహ‌కులు గ‌మ‌నించ‌లేదు. శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Believe it or not! Virat Kohli is a left-handed batsman, says IPL website

ఐపీఎల్ పదో సీజన్ మొదలయ్యాక విరార్ కోహ్లీ బెంగళూరు కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్‌లో విజయం సాధించి, రెండింటిలో ఓటమి పాలైంది.

గత ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్‌లాడి 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో సురేశ్ రైనా తర్వాత విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+