న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ కోసం ఫుట్‌బాల్ స్టేడియాన్ని చెడగొడతారా..?

 Behind the stunning beauty of Kanan Devan hills, the story of how tea came to India

హైదరాబాద్: భారత్‌తో వెస్టిండీస్ జట్టు తలపడనుంది. ఈ పోరకు భారత్ వేదికకానుండటం సంతోషించదగ్గ విషయం. నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కొచ్చి నగరానికి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్‌ కోసం చెడగొట్టడం ఏమిటని పలువురు ఫుట్‌బాలర్లు, అభిమానులు కేరళ క్రికెట్‌ సంఘం (కేసీఏ) తీరును ఎండగడుతుండటంతో బీసీసీఐ దిగొచ్చింది.

ఇప్పటికే కేసీఏ తిరువనంతపురంలో అత్యున్నత ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించింది. ఇందులోనే మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది. గత నవంబర్‌లో భారత్, కివీస్‌ మధ్య మూడో టి20 కొత్త స్టేడియంలో జరిగింది. కానీ ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు కాకుండా కొచ్చిలోని నెహ్రూ స్టేడియం (మల్టీపర్పస్‌)లో నిర్వహించేందుకు కేసీఏ సిద్ధమవుతుంది.

వద్దని సచిన్ అడిగినా:
ఐఎస్‌ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు యజమాని అయిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా దీనిపై స్పందించాడు. 'ఫిఫా గుర్తింపు పొందిన కొచ్చి స్టేడియానికి జరగబోయే నష్టం గురించి ఆందోళనగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్‌ రెండింటికీ సమస్య రాకుండా వ్యవహరించాలని కేరళ క్రికెట్‌ సంఘాన్ని కోరుతున్నా. రెండు ఆటల అభిమానులు నిరాశ పడరాదు. దీనిపై వినోద్‌రాయ్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు' అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక్కడ గతేడాది అండర్‌-17 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు కూడా జరిగాయి. దీని కోసం స్టేడియంను 'ఫిఫా' ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించాలంటే మైదానంలో తవ్వకాలు, పెనుమార్పులు తప్పవు.

సచిన్‌ టెండూల్కర్‌‌తో పాటు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ చెత్రీలు సైతం ఫుట్‌బాల్ స్టేడియం పాడు చేయొద్దంటూ నినదించడంతో బీసీసీఐ దిగొచ్చింది. మ్యాచ్ వేదికను మారుస్తామంటూ నిర్ణయాన్ని ప్రకటించింది.

Story first published: Thursday, March 22, 2018, 13:55 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X