For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షాక్: దూషించిన మోర్గాన్ సెహ్వాగ్ వీరాభిమాని, తంగవేలు స్వర్ణం తన ఖాతాలో..

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల పైన కామెంట్ చేసిన బ్రిటిషన్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ గురించి ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. అతను వీరేంద్ర సెహ్వాగ్‌కు పెద్ద అభిమాని. ఈ విషయాన్ని క్రీడాకారులు నమ్మలేకపోవచ్చు.

ఎవరూ నమ్మలేని విషయాన్ని ఇటీవల వెలుగులోకి వచ్చిన పీర్స్ మోర్గాన్ ట్వీట్స్ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. ఆయన ట్వీట్లలో కొన్ని ముఖ్యమైనవి.. రిటైరైన క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

అదే జర్నలిస్ట్ సవాల్: 'హా..హా..హా..' మళ్లీ చెంప చెళ్లుమనిపించేలా సెహ్వాగ్

అంతేకాదు, పీర్స్ మోర్గాన్ ప్రపంచ ఉత్తమ జట్టును గతంలో ఎంపిక చేశాడు. ఇందులో సెహ్వాగ్‌కు మొదటి స్థానం కల్పించాడు. ఆల్ టైమ్ వన్డే వరల్డ్ గ్రేట్ ఎలెవన్ జట్టులో సెహ్వాగ్, క్రిస్ గేల్‌లను ఓపెనర్లుగా పీర్స్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

మారియప్పన్ తంగవేలు క్రెడిట్ తీసుకున్న పీర్స్ మోర్గాన్

రియో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయులు చివరికి పీవీ సింధు ద్వారా ఓ రజతం, సాక్షి మాలిక్ ద్వారా ఓ కాంస్యం రావడంతో అమితానందపడ్డారు. అయితే, స్వర్ణ పతకం మాత్రం కలగానే మిగిలిపోయింది.

Before their Twitter war, Piers Morgan was Virender Sehwag's biggest fan

ఈ దశలో, పారాలింపిక్స్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన 21ఏళ్ల మారియప్పన్‌ తంగవేలు హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. రియో పారాలింపిక్స్‌లో భారత్ స్వర్ణం సాధించడాన్ని పీర్స్ మోర్గాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన వల్లే భారత్ గెలిచిందన్నాడు.

రియో ఒలింపిక్స్ 2016లో పతకాల విషయంలో పీర్స్ మోర్గాన్ వెటకారం చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు పతకాలు గెలిచిన భారత్ ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుందా అని పీర్స్ మోర్గాన్ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన సెహ్వాగ్.. దానికి సమాధానంగా సెహ్వాగ్‌ మేం చిన్ని చిన్ని సంతోషాలను కూడా గొప్పగా జరుపుకొంటామని, కానీ క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచ కప్‌ నెగ్గలేకపోయిందని, అయితే ఇంకా ఆ దేశం క్రికెట్‌ ఆడుతుండటం సిగ్గుచేటు కదా అని రీట్వీట్‌ చేశాడు.

ఆ తర్వాత, పియర్స్ మోర్గాన్.. నేను రూ.10లక్షలు పందెం కాస్తానని, భారతదేశం మరో ఒలింపిక్‌ స్వర్ణం గెలిచేలోపు ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ నెగ్గుతుందని, సవాల్‌కు సిద్ధమేనా అని ట్వీట్‌ చేశాడు. దానికి సెహ్వాగ్‌ మాత్రం తనదైన శైలిలో కొందరిని దురదృష్టం మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుందని, వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదంటూ.. హాహాహా.. అంటూ నవ్వులు కురిపించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+