న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కొత్త లుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అవార్డు సొంతం

Before IPL, Virat Kohli flaunts his new hairstyle

హైదరాబాద్: విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గానే కాదు.. ఆటతోనూ, స్టైలిష్ లుక్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అతని ఒంటి మీద టాటూలు అందులో భాగమే. ఇక హెయిర్‌స్టైల్‌ విషయంలోనూ కోహ్లి ప్రత్యేకత చూపిస్తాడు. ఎప్పటికప్పడు అప్‌డేటెడ్‌గా ఉండే కోహ్లీ తాజాగా ఐపీఎల్‌కు ముందు మరోసారి కొత్త హెయిర్‌స్టైల్‌తో విరాట్ కనిపించనున్నాడు.

 రెగ్యూలర్‌గా హెయిర్ కట్‌కు భిన్నంగా:

రెగ్యూలర్‌గా హెయిర్ కట్‌కు భిన్నంగా:

ఈ ఫొటోను కోహ్లీ తన అధికార ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్ చేశాడు. రెగ్యూలర్‌గా హెయిర్ కట్ చేసే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిష్ట్ ఆలిమ్ హకీమ్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. నిదహాస్ ట్రోఫీకి విరామం దొరకడంతో ఈ మధ్యే విరాట్ ఓ టాటూ పార్లర్‌లో మరో కొత్త టాటూ వేసుకుంటూ కనిపించాడు.

టాటూల జాబితా:

టాటూల జాబితా:

ఇప్పటి వరకు కోహ్లి చేతి వెనుక మహా శివుడు ధ్యానంలో కూర్చున్నట్లుగా ఉండే టాటూ ఉంటుంది. బైసెప్స్‌పై సమురాయ్ వారియర్ టాటూ.. మరో చేతి బైసెప్స్‌పై తన తల్లిదండ్రుల పేర్లు హిందీలో, వన్డే, టెస్ట్ క్యాప్ నంబర్లు కనిపిస్తాయి. భుజంపై శివుడి మూడో కన్ను, ఓమ్ టాటూలు ఉంటాయి.

విరాట్ కోహ్లీకి దక్కిన అరుదైన రికార్డు:

విరాట్ కోహ్లీకి దక్కిన అరుదైన రికార్డు:

టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన అవార్డు దక్కింది. 2017కు గాను ప్రకటించిన అవార్డుల్లో విరాట్‌ అకౌంట్ మోస్ట్ ఎంగేజ్డ్‌గా సెలక్ట్ అయ్యింది. విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ఎంజాయ్‌మెంట్‌ను పంచుకుంటుంటాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్ అకౌంట్‌కు రెండు కోట్లమంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.

ఇలా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండి... లైక్‌లు, కామెంట్లు ఉంటే ఆ అకౌంట్లను మోస్ట్ ఎంగేజ్డ్‌గా సెలక్ట్ చేస్తారు. అలాగే విరాట్‌కు ఈ అవార్డు దక్కింది.

కోహ్లీ తర్వాత:

కోహ్లీ తర్వాత:

ఇక మిగిలిన అవార్డుల విషయానికి వస్తే... మోస్ట్ ఫాలోవుడ్ అకౌంట్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఉన్నారు. ఎమర్జింగ్ అకౌంట్‌గా ఇషాన్ ఖత్తార్ అవార్డు దక్కించుకున్నారు. అలాగే అలియా భట్, శ్రద్ధా కపూర్‌కు కూడా అవార్డులు వచ్చాయి. అటు క్రికెట్‌లోనే కాదు... ఇటు సోషల్ మీడియా ద్వారా కూడా కోహ్లీ అవార్డుల్ని ఖాతాల వేసుకుంటున్నాడు.

Story first published: Wednesday, March 21, 2018, 15:38 [IST]
Other articles published on Mar 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X