ముంబై: శ్రీలంక పర్యటనలో భాగంగా మూడో టెస్టులో ఇషాంత్ శర్మ తీరును మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తప్పుపట్టారు. మూడో టెస్టులో ఇషాంత్... విరాట్ కోహ్లీ రోల్ పోషించారని (గతంలో కోహ్లీ తీరును ఉద్దేశించి), ఇది సరికాదని అభిప్రాయపడ్డాడు.
ఇషాంత్ శర్మ మరింత ఉత్సుకత ప్రదర్శించాడన్నాడు. ఇషాంత్ ఉత్సుకత కారణంగా అతని పైన వేటు పడిందన్నాడు. క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి అత్యుత్సాహం అవసరమా అని ప్రశ్నించాడు. ఇది అత్యుత్సాహం అన్నాడు.
విరాట్ కోహ్లీలో అత్యుత్సాహం సరికాదని గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ తీరును బిషన్ సింగ్ బేడీ ప్రశంసించాడు. అయితే, కోహ్లీ తన ఉత్సాహాన్ని కొంత తగ్గించుకోవాలని సూచించాడు. ఎల్లప్పుడూ ఓ కెమెరా కెప్టెన్ పైన ఫోకస్ అయి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నాడు.
కాబట్టి అతని అందరికి గుడ్ రోల్ మోడల్‌గా ఉండాలన్నాడు. బంతి, బ్యాటు, ఫీల్డింగులో విరాట్ కోహ్లీ ఉత్సాహంగా ఉండాలని సూచించారు. కానీ నోటి ద్వారా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించాడు. కోహ్లీ కెప్టెన్సీ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ ఇంకా ఎంతో చేయవలసి ఉందన్నాడు. అశ్విన్ బాగా ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. ఏంజిలా మాథ్యూస్ తప్ప మిగతా లంక ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదని అభిప్రాయపడ్డాడు.

టాప్ ట్వంటీలోకి ఎగబాకిన ఇషాంత్, పుజారా
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం.. బౌలర్ ఇషాంత్ మూడు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరుకున్నాడు.
అశ్విన్ 50వ స్థానంలో, అమిత్ మిశ్రా 59వ స్థానంలో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని 20వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్ కోహ్లీ ఒక ర్యాంకు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు.