For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోరూట్‌ను కొట్టి.. జర్నిలిస్ట్‌లను భయపెట్టి.. వార్నర్ మాములోడు కాదు!

డేవిడ్ వార్నర్ అందరితో సరదాగా ఉంటాడు. ప్రేక్షకుల కోసం సమయాన్ని కేటాయిస్తాడు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా ఓ కుర్రాడు మెల్‌బోర్న్ మైదానంలో షేక్ హ్యాండ్ అడిగితే ఏకంగా తన గ్లవ్స్ ఇచ్చి వార్నర్ గొప్ప మనసు చాటుకున్నాడు. కానీ గతంలో డేవిడ్ వార్నర్ మాములోడు కాదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో పాటు బయట దూకుడుగా ఉంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన మొదటి వ్యక్తిగా డేవిడ్ వార్నర్ చరిత్ర స‌‌ృష్టించాడు. 2009లో తొలిసారి ఆసీస్ జెర్సీని ధరించాడు. అయితే 2013 వార్నర్ కెరీర్‌లో చేదు జ్ఞాపకంగా నిలిచింది. ఆ ఏడాది అతడు తీవ్ర వివాదాల్లో ఎదుర్కొన్నాడు. బార్‌లో జరిగిన గొడవలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్‌ను డేవిడ్ వార్నర్ కొట్టాడు.అయితే ఆ తర్వాత వెంటనే రూట్‌కు వార్నర్ క్షమాపణలు చెప్పి, కబుర్లు కూడా చెప్పాడు.

Beating Joe Root and Scaring journalists. David Warner included in so many Controversies

కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంతఈజీగా వదిలిపెట్టలేదు. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా బోర్డు వార్నర్‌‌ను నెల రోజుల పాటు సస్పెండ్‌ చేసి జరిమానా విధించింది. మరోవైపు ఇంగ్లాండ్ తమ ప్లేయర్ తప్పేమి లేదంటూ రూట్‌ను వెనకేసుకొచ్చింది. రూట్‌తో గొడవకంటే నెల రోజుల ముందు వార్నర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇద్దరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులతో ట్విటర్‌లో వార్నర్ గొడవకు దిగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించి వార్నర్‌కు $5750 డాలర్ల జరిమానా విధించింది.

ఇక వార్నర్‌తో పాటు స్టీవ్ స్మిత్ కెరీర్‌‌ను కుదిపేసిన సంఘటన బాల్ టాంపరింగ్. 2018లో కేప్‌టౌన్‌‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు సాండ్ పేపర్‌‌తో ఛీటింగ్ చేశారు. దీంతో వార్నర్, స్మి‌త్‌ను ఏడాది పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించింది. అంతేగాక వారిద్దరిని నాయకత్వ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పించింది. వివాదంలో ఉన్న మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలల పాటు సస్పెండ్ చేసింది.

ఇక ఆ శిక్ష అనుభవించి తిరిగి రీఎంట్రీ ఇచ్చిన వార్నర్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. వివాదాల జోలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో విభేదాలు వచ్చాయి. అయితే ఈ విషయంలో వార్నర్ దూకుడుగా వ్యవహరించలేదు. మౌనం పాటించాడు. కానీ విభేదాలకు అసలైన కారణాలేంటో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు మాత్రం వార్నర్‌కే మద్దతు ఇచ్చారు.

Story first published: Monday, January 1, 2024, 12:08 [IST]
Other articles published on Jan 1, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+