"Be Strong": డ్రెస్సింగ్ రూమ్ నుంచి జడేజాను ఉత్సాహపరిచిన రోహిత్

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ కుప్పకూలిన వేళ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడాడు. టీమిండియా వికెట్ కీపర్ ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్)తో కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు.
జడేజా ఉత్సాహపరిచిన రోహిత్ శర్మ
ఈ క్రమంలో రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డుని నడిపించాడు. దీంతో స్టేడియంలోని అభిమానులతో పాటు ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ కూడా జడేజా ఉత్సాహపరిచాడు.
జడేజా హాఫ్ సెంచరీ
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు డ్రెస్సింగ్ రూం నుంచే సలహాలు, సూచనలు చేశాడు. ఈ క్రమంలో "బీ స్ట్రాంగ్ జడ్డూ. నువ్వు చేయగలవు" అన్నట్లుగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
మరోవైపు ఈ ఓటమితో ఈ ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు.

221 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం వరుసగా రెండో సారి కూడా సెమీస్‌లోనే ముగియగా, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications