భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్. ఆసియా కప్ 2025 కోసం టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ జెర్సీలో ఓ కీలక మార్పు కనిపిస్తోంది. 23 ఏళ్ల తర్వాత భారత జట్టు జెర్సీపై స్పాన్సర్ లోగో లేకుండా బరిలోకి దిగనుంది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే సోషల్ మీడియాలో కొత్త జెర్సీతో కొన్ని ఫోటోలు పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎందుకు స్పాన్సర్ లోగో లేదు?
కొద్ది రోజుల క్రికెట్ భారత సర్కారు ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐకి, డ్రీమ్ 11 సంస్థకు మధ్య ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందం రద్దయింది. గతంలో డ్రీమ్ 11 టీమిండియా జెర్సీకి ప్రధాన స్పాన్సర్‌గా ఉండేది. అయితే కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలు భారత జట్టుకు స్పాన్సర్లుగా ఉండకూడదు. అందుకే బీసీసీఐ కొత్త స్పాన్సర్ ను వెతికే పనిలో పడింది. అయితే ఆసియా కప్‌కు సమయం లేకపోవడంతో ప్రస్తుతం స్పాన్సర్ లోగో లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.

టీమిండియా కొత్త జెర్సీ ఎలా ఉందంటే?
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే షేర్ చేసిన ఫోటోలలో జెర్సీ గతంలో టీ20 ప్రపంచకప్‌లో ధరించిన జెర్సీలాగా ఉంది. కానీ దానిపై 'INDIA' అనే అక్షరాలు పెద్దగా కనిపిస్తున్నాయి. భారత జట్టు జెర్సీ ఎడమ వైపు బీసీసీఐ లోగో, కుడి వైపు ఆసియా కప్ 2025 లోగో ఉన్నాయి. కిట్ తయారీ సంస్థ అడిడాస్(Adidas) లోగో చేతిపై కనిపిస్తుంది.
23 ఏళ్ల తర్వాత ఇదే పునరావృతం
గతంలో 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా టీమిండియా ఇలాగే స్పాన్సర్ లేకుండానే ఆడింది. అప్పుడు కూడా ఓ వివాదం కారణంగా టీమిండియా స్పాన్సర్ లేకుండా ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది.
కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతున్న బీసీసీఐ
బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించింది. టెండర్లను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16 కాగా.. అయితే ఆన్ లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్ లేదా జూదానికి సంబంధించిన సంస్థలు ఈ టెండర్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియా సెప్టెంబర్ 10న యూఏఈతో ఆసియా కప్ లో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్-ఎలో పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్లతో కలిసి ఉంది.
ఆసియా కప్ 2025 భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.