
తొలి భారత ఆటగాడిగా యూసుఫ్ రికార్డు
దీంతో ఓ విదేశీ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత ఆటగాడిగా యూసుఫ్ రికార్డు సృష్టించాడు. అయితే యూసఫ్‌కు అనుమతి ఇచ్చినట్లే విదేశాల్లోని వేరే లీగ్‌ల్లో ఆడేందుకు పలువురు భారత క్రికెటర్లు బీసీసీఐని
సంప్రదించారు. ఈ నేపథ్యంలో బోర్డు అధికారుల ఆలోచన మారినట్లు తెలుస్తోంది.

యూసుఫ్‌కు ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసిన బీసీసీఐ
భారత క్రికెటర్లు వేరే దేశాల లీగ్ పోటీల్లో ఆడితే, ఐపీఎల్ స్పాన్సర్లు అటు వైపు మళ్లుతారన్న ఆలోచనతోనే యూసుఫ్‌కు ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేయాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు యూసుఫ్‌ను లీగ్ నిర్వాహకులు ప్రచారకర్తగా మాత్రమే నియమించుకున్నారని, అతడికి లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

యూసుఫ్ పఠాన్ ఆశలు అడియాసలు
బీసీసీఐ తాజా నిర్ణయంతో హాంకాంగ్ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకున్న యూసుఫ్ పఠాన్ ఆశలు అడియాసలయ్యాయి. టీమిండియాకు చివరిసారిగా 2012లో యూసప్ పఠాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పఠాన్ కేవలం దేశవాళీ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు.

హాంకాంగ్ లీగ్‌లో శ్రీలంక దిగ్గజాలు
యూసుఫ్ పఠాన్‌కి ముందు పాకిస్థాన్‌కు ఆటగాడు షాహిద్ అఫ్రిదీ, ఇంగ్లాండ్‌కు చెందిన తైమల్ మిల్స్ ఇదే ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నారు. హాంకాంగ్ లీగ్‌లో శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్‌లతో పాటు వెస్టిండిస్ డారెన్ సమీ, న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ ఫ్రాంక్లిన్, దక్షిణాఫ్రికా జాహాన్ బోతాలు వివిధ ప్రాంఛైజీలతో ఒప్పందాలు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











