బర్త్‌డే బాయ్: రోహిత్ శర్మకు శుభాకాంక్షలు వెల్లువ
ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఈరోజుతో 29 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున భార్య రితిక, సన్నిహితలు సమక్షంలో కేక్ కట్ చేసి రోహిత్ శర్మ 30వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను రోహిత్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కీ సాధ్యం కాని సరికొత్త రికార్డుని తనపేరిట లిఖించాడు. వన్డే క్రికెట్‌లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ.

అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(264) సాధించాడు. రోహిత్ శర్మ పుట్టినరోజుని పురస్కరించుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి.
ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన బర్త్ డే విషెస్‌లో ఐసీసీ రోహిత్ శర్మను ఆకాశానికెత్తేసింది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్ గానే కాక తక్కువ సమయంలోనే 5 వేల పరుగుల మైలురాయిని సాధించాడని ట్విట్టర్‌లో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications