Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఈ ఆదివారమే ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుద‌ల.. క్వారంటైన్ నిబంధ‌న‌ల్లోనూ మార్పులు

BCCI will announce the IPL 2022 schedule on Sunday.. There is a possibility of reducing the quarantine terms to 3 days

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 షెడ్యూల్‌ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్ర‌క‌టించనుంది. ఇప్ప‌టికే లీగ్ ఈ నెల 26న ప్రారంభ‌మై మే 29న ఫైన‌ల్ మ్యాచ్‌తో ముగుస్తుంద‌ని బీసీసీఐ అధికారికంగా ధృవిక‌రించిన‌ప్ప‌టికీ షెడ్యూల్‌ను మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

 ఆదివారమే షెడ్యూల్‌

ఆదివారమే షెడ్యూల్‌

ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను ఆదివారం ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు. దీంతో ఐపీఎల్ టైమ్ టేబుల్, మ్యాచ్‌ల వివరాల‌పై ఆదివారం క్లారిటీ రానుంది. అయితే ఆదివారం బీసీసీఐ కేవ‌లం లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్ర‌క‌టిస్తుంద‌ని, ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను త‌ర్వాత వెల్ల‌డిస్తుంద‌ని స‌ద‌రు అధికారి తెలిపారు. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించ‌డానికి బోర్డు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు 25 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు చెప్పారు. క‌రోనా ప‌రిస్థితుల‌ను బట్టి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించే సంఖ్య‌లో పెరుగుద‌ల ఉంటుంద‌ని బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ సంఖ్య 50 శాతం వ‌ర‌కు పెరగొచ్చని ఆయ‌న హింట్ ఇచ్చారు.

క్వారంటైన్ నిబంధ‌న‌ల్లో మార్పులు

క్వారంటైన్ నిబంధ‌న‌ల్లో మార్పులు

ఐపీఎల్‌లో పాల్గొన‌డానికి వ‌చ్చే విదేశీ ఆట‌గాళ్ల క్వారంటైన్ నిబంధ‌న‌ల్లోనూ మార్పులు చేసే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉంది. విదేశీ ఆట‌గాళ్లు ఉండాల్సిన త‌గిన క్వారంటైన్ నిబంధ‌న‌లకు ఆదివారం ఆమోదం తెల‌ప‌నుంది. విదేశీ ఆట‌గాళ్లంతా త‌ప్ప‌ని స‌రిగా 5 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంద‌ని బోర్డు ఇప్ప‌టికే ఫ్రాంచైజీల‌న్నింటికి తెలిపింది. అయితే క‌రోనా కేసులు త‌గ్గ‌డం, వ్యాక్సినేష‌న్ కూడా పెర‌గ‌డంతో ఇత‌ర సిరీస్‌ల్లో ఆడుతున్న ఆట‌గాళ్లు ఐపీఎల్‌కు వ‌చ్చే క్ర‌మంలో వారి క్వారంటైన్ రోజుల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంది. అలాంటి ఆట‌గాళ్ల క్వారంటైన్ గ‌డువును 3 రోజుల‌కు త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఆ ఆట‌గాళ్లు నేరుగా ఇండియాకు

ఆ ఆట‌గాళ్లు నేరుగా ఇండియాకు

కాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ త‌దితర దేశాల ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఆడ‌డానికి భార‌త్ రానున్నారు. వీరిలో వెస్టిండీస్‌- ఇంగ్లండ్ సిరీస్‌, పాకిస్థాన్ -ఆస్ట్రేలియా సిరీస్‌, బంగ్లాదేశ్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడుతున్న ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఆడ‌డానికి నేరుగా ఇండియాకు రానున్నారు.

 ఐపీఎల్‌ 2022లో ఆడే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు

ఐపీఎల్‌ 2022లో ఆడే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆర్సీబీ), మార్కస్ స్టోయినిస్ (ల‌క్నో), మిచెల్ మార్ష్ (ఢిల్లీ), టిమ్ డేవిడ్ (ముంబై), జోష్ హేజిల్‌వుడ్ (ఆర్బీబీ), పాట్ కమిన్స్ (కోల్‌క‌తా), డేవిడ్ వార్నర్ (ఢిల్లీ), సీన్ అబాట్ (స‌న్‌రైజ‌ర్స్‌), డేనియల్ సామ్స్ (ముంబై), మాథ్యూ వేడ్ (గుజ‌రాత్), నాథన్ కౌల్టర్-నైల్ (రాజ‌స్థాన్), రిలే మెరెడిత్ (ముంబై), నాథన్ ఎల్లిస్ (పంజాబ్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ (ఆర్సీబీ).

ఐపీఎల్‌ 2022లో ఆడే న్యూజిలాండ్ ఆటగాళ్లు

ఐపీఎల్‌ 2022లో ఆడే న్యూజిలాండ్ ఆటగాళ్లు

కేన్ విలియమ్సన్ (స‌న్‌రైజ‌ర్స్‌), లాకీ ఫెర్గూసన్ (గుజ‌రాత్), ట్రెంట్ బౌల్ట్ (రాజ‌స్థాన్), ఆడమ్ మిల్నే (సీఎస్కే), మిచెల్ సాంట్నర్ (సీఎస్కే), టిమ్ సౌతీ (కోల్‌క‌తా), జేమ్స్ నీషమ్ (రాజ‌స్థాన్), గ్లెన్ ఫిలిప్స్ (స‌న్‌రైజ‌ర్స్‌), డెవాన్ కాన్వే (సీఎస్కే), ఫిన్ అలెన్ (ఆర్స‌బీ), టిమ్ సీఫెర్ట్ (ఢిల్లీ).

ఐపీఎల్ 2022లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు

ఐపీఎల్ 2022లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు

కగిసో రబడ (పంజాబ్), ఫాఫ్ డు ప్లెసిస్ (ఆర్సీబీ), క్వింటన్ డి కాక్ (పుణే), అన్రిచ్ నార్ట్జే (ఢిల్లీ), మార్కో జాన్సెన్ (స‌న్‌రైజ‌ర్స్‌), డేవిడ్ మిల్లర్ (గుజ‌రాత్), డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై) , ఐడెన్ మార్క్రామ్ (స‌న్‌రైజ‌ర్స్‌), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (రాజ‌స్థాన్), లుంగి ఎన్గిడి (ఢిల్లీ), డ్వైన్ ప్రిటోరియస్ (సీఎస్కే).

Story first published: Saturday, March 5, 2022, 15:55 [IST]
Other articles published on Mar 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+