
హైదరాబాద్: ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ బోర్డు వెబ్‌సైట్ చిన్న తప్పిదం కారణంగా ఆగిపోయింది. అధికారికంగా www.bcci.tv అనే పేరుతో ఉన్న ఈ వెబ్ సైట్ రెన్యూవల్ చేయకపోవడంతో వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది.
ప్రముఖ వాణిజ్య వెబ్ సైట్లైన రిజిస్ట్రార్ డాట్ కామ్, నేమ్ జెట్ డాట్ కామ్ ల ద్వారా సదరు వెబ్‌సైట్‌ను 270 డాలర్లకు కొనుగోలు చేసింది.
2 ఫిబ్రవరి 2006 నుంచి 2 ఫిబ్రవరి 2019 వరకు వ్యాలిడిటీ ఉంది. బోర్డు డొమైన్ కాలవ్యవధి 2-2-2006 నుంచి 2-2-2019 వరకైతే... ఏడాది ముందే అంటే తేదీ 3-2-2018లోపు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోవాలి. కానీ క్రికెట్ బోర్డు ఆ పని చేయకపోవడంతో వెబ్‌సైట్స్ రిజిస్ట్రార్స్ రిజిస్టర్.కామ్ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది.
బీసీసీఐ గడిచిన సెప్టెంబరులో ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌కు అమ్మి 2.55 బిలియన్లు సంపాదించుకుంది. ఇప్పటి వరకు గరిష్టంగా బీసీసీఐ వార్షిక వేతనం 405 మిలియన్ డాల్లరుగా ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.