Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇర్ఫాన్‌ పఠాన్‌, అనుజ్‌ రావత్‌కి బీసీసీఐ హెచ్చరికలు

BCCI warns Irfan Pathan, Anuj Rawat & suspends Rinku Singh for playing in unsanctioned T20 league

సీనియర్‌ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, అండర్‌-19 మాజీ కెప్టెన్‌ అనుజ్‌ రావత్‌లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనేందుకు ఇర్ఫాన్‌ పఠాన్‌ దరఖాస్తు చేసుకోవడంతో అతడిని హెచ్చరించింది. అనుజ్‌ రావత్‌ కూడా బీసీసీఐ అనుమతి లేకుండా మారిషస్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్లతో కలిసి టీ20లీగ్‌ ఆడాడు. పఠాన్‌లాగే రావత్‌ని కూడా బీసీసీఐ అధికారులు హెచ్చరించి వదిలేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ రింకూ సింగ్‌పై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండా ఇటీవల అబుదాబిలో జరిగిన టీ20 టోర్నీలో పాల్గొనడమే అతడి వేటుకు కారణమైంది. బోర్డు నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా రింకు సింగ్‌ మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ సీనియర్ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌, అనుజ్‌ రావత్‌ను హెచ్చరించి వదిలేసి.. రింకూ సింగ్‌పై ఎందుకు వేటు వేశారని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారిని ప్రశ్నించగా.. 'యువ ఆటగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే హెచ్చరికలు జారీ చేశాం. ఇది చూసి మరెవ్వరు కూడా తప్పులు చేయరు' అని సమర్థించుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు సింగ్ ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 21 ఏళ్ల రింకు సింగ్ ఇప్పటి వరకు 19 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. వీటితో పాటు 24 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Saturday, June 1, 2019, 10:10 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+