INDvsSL: కీలక ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ అతిజాగ్రత్త.. అందుకే శ్రీలంక సిరీస్‌కు దూరం..!

టీమిండియాలో కీలకమైన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ అతి జాగ్రత్త పోతోంది. వాళ్లను వెంటనే మైదానంలోకి తీసుకురావాలని అనుకోవడం లేదు. బాగా టైం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అవును.. భారత పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించే ఇప్పుడు మాట్లాడుతోంది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన వీళ్లిద్దరూ పలు కీలక టోర్నీలో మిస్సయ్యారు.

వెన్నునొప్పితో బుమ్రా..
కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధ పడుతూ వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఇక దాన్ని తట్టుకోలేకపోవడంతో అతనికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే అతను పూర్తిగా కోలుకోక ముందే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత బుమ్రా గాయం మళ్లీ తిరగబెట్టింది.
దీంతో అతను టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం గాయం నుంచి దాదాపు కోలుకున్న బుమ్రా.. బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయినా సరే అతనికి మరికొంత టైం ఇవ్వాలని అనుకుంటోందట బీసీసీఐ.

జడ్డూ విషయంలో కూడా..
ఆసియా కప్ మధ్యలో మోకాలి నొప్పి తీవ్రతరం కావడంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరమయ్యాడు. మోకాలికి శస్త్ర చికిత్స తర్వాత అతను కూడా నెమ్మదిగా కోలుకుంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ నాటికి అతను పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ భావించింది.
అయితే జడ్డూ అప్పటికి కోలుకోలేదు. దీంతో అతనికి కూడా కోలుకోవడానికి టైం ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయింది. కీలకమైన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా టూర్ నాటికి అతన్ని జట్టుతో చేర్చాలని అనుకుంటోంది.

పంత్, ఇతరులు కూడా..
టీమిండియాలో గాయాలు మరీ ఎక్కువైపోయాయి. బుమ్రా, జడ్డూ పునరాగమనం కోసం ఎదురు చూస్తుండగానే రిషభ్ పంత్ కూడా గాయపడ్డాడు. అతను కూడా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతనికి శ్రీలంకతో సిరీస్‌కు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. జనవరి 3న ఎన్సీయేకి పంత్ చేరుకుంటాడని, అక్కడే రిహాబిలిషేన్‌లో పాల్గొంటాడని తెలిపింది.
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సిరీస్ నాటికి అతను మళ్లీ జట్టుతో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా గాయాలతో బాధ పడుతున్న దీపక్ చాహర్ కూడా ప్రస్తుతం ఎన్సీయేలోనే ఉన్నాడు. సెప్టెంబరు నెలలో ఇండియా ఎ తరఫున ఆడుతూ గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications