
కివీస్ టూర్..
దీపావళి పండగకు ఒక్క రోజు ముందే బీసీసీఐ.. అతని నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. ఆ వెంటనే రాహుల్ ద్రవిడ్.. అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. టీ20 ప్రపంచ కప్ తరువాత టీమిండియా- న్యూజిలాండ్‌కు పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఈ సిరీస్ టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ద్రవిడ్ ఉన్నారు.

పూర్తిస్థాయి కోచ్‌గా..
ఇదివరకు రాహుల్ ద్రవిడ్.. శ్రీలంకలో పర్యటించిన వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 టీమ్‌కు హెడ్ కోచ్‌గా పని చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ల జట్టు అయిదు టెస్ట్ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా.. శిఖర్ ధవన్ కేప్టెన్సీలో మరో టీమ్ శ్రీలంకలో పర్యటించింది. లంకేయులతో మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్ సిరీస్‌ను ఆడింది. ఇందులో టీ20ల్లో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పని చేయనున్నారు.

వన్డే ఫార్మట్‌కూ కొత్త కేప్టెన్..
కాగా- రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించిన తరువాత.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వన్డే ఇంటర్నేషనల్స్ జట్టుకు కూడా కొత్త కేప్టెన్‌ను అపాయింట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విరాట్ కోహ్లీని తప్పించి- ఆ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు జట్టు పగ్గాలను అప్పగించే దిశగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఆ సీనియర్ బ్యాటర్.. రోహిత్ శర్మే అవుతాడు.

టీ20 ఫార్మట్ నుంచి
ప్రస్తుతం మూడు ఫార్మట్లకు కూడా విరాట్ కోహ్లీ కేప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత.. అతను టీ20 ఫార్మట్ నుంచి తప్పుకోనున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్‌కు కొనసాగుతాడు. ఈ విషయాన్ని ఇదివరకే అధికారికంగా ప్రకటించాడు కూడా. ఇప్పుడు తాజాగా బీసీసీఐ వన్డే ఫార్మట్‌కు కూడా కొత్త కేప్టెన్‌ను నియమించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ అపాయింట్‌మెంట్ తరువాత తన మనసును మార్చుకుందని అంటున్నారు.

కోహ్లీ ఛరిష్మా మసకబారిందా..
అదే జరిగితే- విరాట్ కోహ్లీపై వేటు పడటం ఖాయం అవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా వన్డే ఫార్మట్ నుంచి తప్పించి, మరో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు కేప్టెన్‌గా అవకాశాన్ని ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోన్నట్లు చెబుతున్నారు. జట్టు సారథిగా విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో ఎదురవుతోన్న వరుస పరాజయాలు అతని ఛరిష్మాను మసకబారేలా చేశాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications
