INDvsSL: ఆ సిరీస్‌లో పగ్గాలు పాండ్యాకే.. రాహుల్ కెరీర్ క్లోజ్ అంటున్న బీసీసీఐ..!

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ భారత్ గెలిచింది. అయితే అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో రెండో వన్డేలో టీమిండియా సారధి రోహిత్ శర్మకు గాయమైన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని చెప్పిన బీసీసీఐ.. టెస్టు సిరీస్‌లో రోహిత్‌ను ఆడించలేదు. ఇప్పుడు వచ్చే శ్రీలంక సిరీస్‌కు కూడా అతన్ని ఎంపిక చేయడం లేదని తెలుస్తోంది.

పాత సెలెక్షన్ కమిటీనే
శ్రీలంకతో తలపడే జట్టును కూడా చేతన్ శర్మ నేతృత్వంలోని పాత సెలెక్షన్ కమిటీనే ఎంపిక చేస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే జనవరి 3 నుంచి శ్రీలంకతో సిరీస్ ప్రారంభం అవుతుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో భారత్ కోసం రెండు బృందాలను చేతన్ శర్మ టీం ఎంపిక చేస్తుందని సమాచారం. పరిమిత ఓవర్ల సిరీస్‌లో, ముఖ్యంగా టీ20 సిరీస్‌లో టీమిండియా పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని బీసీసీఐ డిసైడ్ అయిందట. అంతేకాదు, రోహిత్ శర్మ అప్పటికి గాయం నుంచి కోలుకుంటాడా? అనేది కూడా అనుమానమే అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

రాహుల్ పని అయిపోయినట్లే..
టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత నెమ్మదైన ఆటతీరుతో విమర్శలపాలైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందట. పొట్టి ఫార్మాట్‌కు రాహుల్ పనికిరాడని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్, రోహిత్ ఇద్దరూ నిదానంగా ఆడటంతో భారత్ అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో రాహుల్ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని బీసీసీఐ అధికారులు అంటున్నారు.

రోహిత్ గాయం..
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ గాయపడ్డాడు. ఎడ్జ్ తీసుకొని వచ్చిన బంతిని అందుకునే సమయంలో.. అది అతని బొటనవేలికి బలంగా తాకింది. దాంతో ఎముక పక్కకు జరిగింది. వెంటనే మైదానం వీడిన అతన్ని ఢాకాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ మ్యాచ్‌లో రోహిత్ చివరి వరకు బ్యాటింగ్ చేయలేదు. చివర్లో భారత్‌ను గెలిపించేందుకు మైదానంలోకి దిగినా ఫలితం మారలేదు. అయితే ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే అతను ముంబై వచ్చేశాడు. ఇక్కడ చికిత్స చేయించుకున్నాడు. మూడో వన్డేతోపాటు రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications