Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సద్దుమణిగిన బీసీసీఐ-సీఏ వివాదం.. షెడ్యూల్ ప్రకారమే ఆస్ట్రేలియా టూర్

Women’s T20 : Australia Set To Tour India For Limited Overs Series Next Year || Oneindia Telugu
BCCI vs CA conflict: Australia set to tour India for limited overs series next year

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దిగిరావడంతో.. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య వివాదం సద్దుమణిగింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో ఆసీస్ వన్డే సిరీస్ ఆడబోతుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019-2020లో ఆసీస్ ఆడే సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భారత్ సిరీస్‌ అనుకున్న సమయంలో న్యూజిలాండ్‌తో సిరీస్ జరిగితే తమకు లాభం చేకూరుతుందని.. స్వదేశంలో ప్రసారదారుల నుంచి వచ్చిన ఒ త్తిడి మేరకు భారత్ పర్యటనలో మార్పులు చేయాలని బీసీసీఐని సీఏ కోరింది. ఈ నేపథ్యంలో జనవరిలో ఆసీస్‌ టూర్‌పై పలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ వెనక్కు తగ్గకపోవడంతో.. యథావిధిగా ఆ పర్యటనకు తమ జట్టును పంపేందుకు సీఏ అంగీకరించింది.

ఈ వివాదం కారణంగానే ప్రస్తుతం జైపూర్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఛాలెంజ్‌(మినీ ఐపీఎల్‌)లో ఆసీస్ మహిళా క్రీడాకారిణిలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆడనివ్వలేదు. దీంతో ఆసీస్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. మహిళల టీ20 ఛాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీ రాజ్, స్మృతి మంధానాలు ఈ మూడు జట్లకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు.

Story first published: Wednesday, May 8, 2019, 10:23 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+