ఐపీఎల్ లో హనీట్రాప్ కలకలం?
ఐపీఎల్ సందర్భంగా ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. హనీ ట్రాప్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఐపీఎల్ జట్లకు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, భవిష్యత్తులో ఆటగాళ్లు, జట్లు తప్పనిసరిగా వీటిని పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించడం, అనధికార కదలికలు, హనీ ట్రాపింగ్ వంటి విషయాల్లో జట్లు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం, రియాన్ పరాగ్ వాపింగ్ వివాదం వంటి అనేక వివాదాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ సీజన్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ ప్రొఫెషనలిజం, క్రమశిక్షణను పెంపొందించాలని కోరుతూ బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా గురువారం 10 ఫ్రాంఛైజీలకు లేఖ రాశారు. ఈ సీజన్‌లో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం తమ దృష్టికి వచ్చిందని, ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ నుంచి ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ, భద్రతా అవగాహన, ప్రోటోకాల్ ప్రమాణాలను పెంపొందించడానికి చర్యలు తీసుకున్నట్లు సైకియా తెలిపారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారుల దుష్ప్రవర్తన, ప్రోటోకాల్ ఉల్లంఘన సంఘటనలు జరిగాయని, వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే, టోర్నమెంట్, సంబంధిత ఫ్రాంచైజీలతో పాటు బీసీసీఐ గణనీయమైన ప్రతిష్టకు హాని కలిగించే అవకాశం ఉందని సైకియా తెలిపారు. అవి వ్యక్తులు, ఫ్రాంఛైజీలను చట్టపరమైన చర్యలు, భద్రతా ప్రమాదాలకు దారి తీయవచ్చని వివరించారు.
ఆటగాళ్ల హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తుల సందర్శనలు ప్రధాన ఆందోళన కలిగించే అంశంగా బీసీసీఐ తన లేఖలో వెల్లడించింది. కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది.. సంబంధిత ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులను తమ హోటల్ గదుల్లోకి అనుమతించినట్లు గమనించామని పేర్కొంది. కొందరు ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫీషియల్స్ యాక్సెస్ ప్రోటోకాల్ పాటించలేదని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రత్యేకంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులు లైవ్ మ్యాచ్ పరిస్థితుల్లో ఆటగాళ్లతో మాట్లాడటానికి, సమీపించడానికి, ఆలింగనం చేసుకోవడానికి లేదా భౌతికంగా సంభాషించడానికి ప్రయత్నించిన సంఘటనలు జరిగాయని, అటువంటి ప్రవర్తన, ఎంత మంచి ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ను నేరుగా ఉల్లంఘించినట్టవుతుందని, టీమ్ డైనమిక్స్, మ్యాచ్ కార్యకలాపాలపై జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని అని బీసీసీఐ వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications