For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకే కాదు..బీసీసీఐ ఖాతాలోనూ ఓ ల్యాండ్‌మార్క్‌!

BCCI Twitter Followers crossed 9 million mark

ముంబై: ఇంగ్లండ్ వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ ముగింపు ద‌శ‌లో ఉంది. ఇంకో మూడు మ్యాచ్‌లు ముగిశాయంటే.. లీగ్ ద‌శ ఖ‌త‌మ్ అయిపోతుంది. ఇక సెమీ ఫైన‌ల్‌, ఆ త‌రువాత ఫైన‌ల్‌. ప్ర‌పంచ‌క‌ప్ జ‌గ‌జ్జేత‌గా ఎవ‌రు ఆవిర్భ‌విస్తారో తెలియ‌డానికి ఇక ఎంతో స‌మ‌యం అవ‌స‌రం లేదు. ఈ నెల 14వ తేదీన ఈ మిస్ట‌రీ తేలిపోతుంది.

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా క్రికెట‌ర్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. రోహిత్‌శ‌ర్మ‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, చివరికి విజ‌య్ శంక‌ర్ కూడా ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌పై త‌మ‌దైన చెర‌గ‌ని ముద్ర వేస్తున్నారు. ఇదిలావుండ‌గా- టీమిండియాను న‌డిపిస్తోన్న భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కూడా ఓ ల్యాండ్‌మార్క్‌ను అందుకోవ‌డం విశేషం.

బీసీసీఐ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య 90 ల‌క్ష‌ల‌ను దాటింది. బుధ‌వారం రాత్రి తాము ఈ మైలురాయిని అధిగ‌మించిన‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. ఇదీ ఓ రికార్డుగానే చెప్పుకోవ‌చ్చు. ఏ దేశ క్రికెట్ బోర్డు ట్విట్ట‌ర్ అకౌంట్‌కు కూడా 90 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్లు లేరు. తొమ్మిది మిలియ‌న్ల మంది క్రికెట్ ప్రేమికులు త‌మ‌ను అభిమానిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే కోటిని అధిగ‌మిస్తామ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది బీసీసీఐ.

Story first published: Thursday, July 4, 2019, 15:32 [IST]
Other articles published on Jul 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+