మహిళల ఐపీఎల్‌పై ప్రపంచకప్ తర్వాత తుది నిర్ణయం: బీసీసీఐ

ప్రపంచంలో అత్యంత సక్సెస్‌ఫుల్ క్రికెట్ లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రస్థానంలో ఉంటుంది. బీసీసీఐకి అక్షయ పాత్రగా మారిన ఈ టీ20 లీగ్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సాధించింది. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో మహిళా క్రికెట్‌కు కూడా క్రీడాభిమానుల్లో ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ లీగ్ ఎలా నిర్వహించాలి? ఎన్ని జట్లు ఉంటాయి? వంటి వివరాలపై ఇంకా ఒక పూర్తి ముఖచిత్రం రాలేదు. దీనిపై త్వరలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పష్టం చేశారు.

గంగూలీ హయాంలో బీజాలు..
బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ ఉండగా మహిళల ఐపీఎల్ ప్రతిపాదన వచ్చింది. ఈ ఐడియా బాగా నచ్చిన గంగూలీ వచ్చే ఏడాదిలో పురుషుల ఐపీఎల్ జరగడానికి ముందే.. అంటే మార్చి నెలలోనే మహిళల ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించాడు. మొత్తం ఐదు జట్లతో ఈ టోర్నీ ప్రారంభించాలని ఆలోచన చేశాడు. ఈ లీగ్ రూపురేఖలపై ఒక ఐడియా రాకముందే.. బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మరుసటి మీటింగ్‌లో తుదినిర్ణయం
తాము కూడా మహిళల ఐపీఎల్ విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ వెల్లడించారు. మొత్తం ఐదు జట్లతో ఈ లీడ్ ప్రారంభించే అవకాశాలుండగా.. ఈ జట్లను ఎలా విభజిస్తారు? లీగ్ రూపురేఖలు ఏంటి? అనే అంశాలపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. 'లీగ్ ఏర్పాటుకు కావలసిన చర్యలన్నీ ముగిశాయి. కాకపోతే జట్ల విభజన గురించి ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదంతే. దీని గురించి కూడా చర్చిస్తున్నాం కానీ.. ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తదుపరి సమావేశంలో దీనిపై కూడా డెసిషన్ తీసుకుంటాం' అని బిన్నీ స్పష్టం చేశారు.

తేలనున్న చేతన్ శర్మ భవితవ్యం?
మహిళల ఐపీఎల్‌తోపాటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై కూడా వచ్చే మీటింగ్‌లో ఒక నిర్ణయం తీసుకుంటామని బిన్నీ వెల్లడించారు. న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఇటీవల ప్రకటించిన జట్లలో అర్హత ఉన్న ఆటగాళ్లకు అవకాశం దక్కలేదని విమర్శలు వచ్చాయి. దానికితోడు సెలెక్షన్ కమిటీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించే వాళ్లు లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూడా మాట్లాడిన బిన్నీ.. 'వచ్చే మీటింగ్‌లో దీనిపై కూడా కూర్చొని చర్చిస్తాం. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఈ మీటింగ్ ఉంటుంది' అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications