Team India: టీ20 జట్టులో భారీ మార్పులు.. కుర్రాళ్లకు పెద్ద పీట వేస్తున్న సెలెక్టర్లు!

టీ20 ప్రపంచకప్‌లో భారత ఓటమితో ఆ జట్టు ఆటతీరుపై కూడా అనుమనాలు తలెత్తాయి. ఆటగాళ్ల మైండ్‌సెట్, వాళ్లు ఆడే విధానంపై కూడా విమర్శలు వచ్చాయి. దానికితోడు కొందరు సీనియర్లు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత జట్టులో యువరక్తాన్ని నింపాలని బీసీసీఐ భావిస్తోందట. అందుకోసమే ఆరుగురు యువ ఆటగాళ్లను టీ20 సెటప్‌లో భాగం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పృథ్వీ షా
ఈ ఏడాది ఐపీఎల్ సహా దేశవాళీ టీ20 టోర్నీల్లో దుమ్మురేపిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే అతను పృథ్వీ షానే. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అతను అద్భుతమైన ఆరంభాలందించాడు. ఆ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కూడా అదరగొట్టాడు. అతన్ని ఎలాగైనా టీ20 సెటప్‌లో చేర్చాలని బీసీసీఐ నిర్ణయించిందట.

వాషింగ్టన్ సుందర్
బంతితో మాయ చేస్తూనే అవసరమైన సమయంలో ధాటిగా ఆడగల ఆటగాడు వాషింగ్టన్ సుందర్. అతని స్పిన్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ కూడా జట్టుకు ఉపయోగ పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతన్ని పొట్టి ఫార్మాట్‌లో ఎంపిక చేసి, జట్టులో కొనసాగించాలని అనుకుంటోందట.

దీపక్ చాహర్
బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తూ.. పవర్‌ప్లేలోనే వికెట్లు తీయగలిగే బౌలర్ దీపక్ చాహర్. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతను అద్భుతంగా రాణించాడు. టీ20 ప్రపంచకప్ ముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా చెలరేగాడు. జట్టుకు అతని బౌలింగ్ బలంగా మారుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.

ఇషాన్ కిషన్
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ ఈ ప్రపంచకప్‌లో ఎంత ఘోరంగా విఫలమైందో అందరికీ కనిపించింది. అందుకే ఓపెనింగ్ జోడీలో నిజంగా ఇంటెంట్ చూపించగలిగే ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. అందుకే ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారు సెలెక్టర్లు.

సంజూ శాంసన్
జట్టులో ఏ స్థానంలో అయినా ఆడుతూ, అద్భుతంగా ఆడగలిగే ఆటగాడు సంజూ శాంసన్. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా ఉండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం. అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణించిన అతన్ని కూడా జట్టులో తీసుకోవాలని భావిస్తున్నారు.

ఉమ్రాన్ మాలిక్
భారత బౌలింగ్ దళంలో తగ్గిన ముఖ్యమైన అంశం వేగం. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న భారత సెలెక్టర్లు.. అత్యంత వేగంగా బౌలింగ్ చేసే భారత పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను కూడా జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు. అసలు ఈ ప్రపంచకప్‌లోనే అతన్ని ఆడించాలని డిమాండ్లు వచ్చినా.. అనుభవలేమి కారణంగా అతన్ని పక్కనపెట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications