Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ రద్దుతో ఒక్కో ఫ్రాంచైజీకి ఎంత నష్టమో తెలుసా?.. ఇక బీసీసీఐ పరిస్థితి అగమ్యగోచరం!!

BCCI to incur loss of 10,000 crores if IPL 2020 is cancelled, says Reports


హైదరాబాద్:
మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్‌-19) ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌-13ను ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేసింది. కానీ.. అప్పటికి దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ అయితేనే ఐపీఎల్ సాధ్యం కానుంది. ఇక విదేశీ ఆటగాళ్లకు వీసాలు రాకపోతే?, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే?, ఫ్రాంచైజీలు, ఐపీఎల్‌, బీసీసీఐ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న.
బ్రాడ్‌కాస్టర్‌పై తీవ్ర ప్రభావం:

బ్రాడ్‌కాస్టర్‌పై తీవ్ర ప్రభావం:

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్‌ 2020ని ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తే? ఆ ప్రభావం బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లపై పడుతుంది. ఆందరికి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సుమారు రూ. 3200 కోట్లని నష్టపోవాల్సి ఉంటుందట. స్టార్ స్పోర్ట్స్ రూ. 16వేల కోట్లతో ఐదేళ్లకాలానికి ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్‌ని స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా నిర్వహించినా.. టీవీ వ్యూవర్‌షిప్, డిజిటిల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొంత నష్టాన్ని స్టార్‌స్పోర్స్ తగ్గించుకునే అవకాశం ఉంది.

 ఫ్రాంఛైజీలకు భారీ నష్టం:

ఫ్రాంఛైజీలకు భారీ నష్టం:

ఏప్రిల్ 15లోపు కరోనా వైరస్ అదుపులోకి వస్తే.. టోర్నీజరుగుతుంది. కానీ.. ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించడం మాత్రం కష్టమే అని సమాహారం. వైరస్ సోకిన 14 రోజుల తర్వాత అది బహిర్గతమవుతుండటమే ఇక్కడ సమస్య. దీంతో ఖాళీ స్టేడియాల్లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఎనిమిది జట్ల ఫ్రాంఛైజీలకి మొత్తంగా టికెట్ల రూపంలో రూ. 400 కోట్లు నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. టోర్నీ మాత్రం రద్దైతే ఏకంగా ఒక్కో ఫ్రాంచైజీ రూ.150- 200 కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఇది పెద్దదెబ్బే.

యాడ్స్ కంపెనీలకు రిటర్న్ మనీ:

యాడ్స్ కంపెనీలకు రిటర్న్ మనీ:

ఒకవేళ ఐపీఎల్‌ని రద్దు చేస్తే.. యాడ్స్ కంపెనీలకు బదులు తిరిగి ఇచేయాల్సి ఉంటుంది. మొత్తం డబ్బుని ఐపీఎల్ మేనేజ్‌మెంట్, బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంఛైజీలు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 200 కంపెనీలు రూ. వందల కోట్లతో ఒప్పందాలు పూర్తి కుదుర్చుకున్నాయట. దీంతో బీసీసీఐకి ఏం చేయాలో అర్ధం కావట్లేదు. యాడ్స్ ప్రభావం ఐపీఎల్ బ్రాండ్‌ వాల్యూపైనా తీవ్రంగా పడనుంది.

బ్రాండ్‌ విలువపై ప్రభావం:

బ్రాండ్‌ విలువపై ప్రభావం:

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ (రూ.800 కోట్లు), చెన్నై సూపర్‌కింగ్స్‌ (రూ.732 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (రూ.629 కోట్లు), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (రూ.595 కోట్లు) బ్రాండ్‌ విలువ ప్రకారం ముందున్నాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ.483 కోట్లు), డిల్లీ క్యాపిటల్స్‌ (రూ.374 కోట్లు), కింగ్స్‌ XI పంజాబ్‌ (రూ.358 కోట్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (రూ.271) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రద్దుతో వీటి బ్రాండ్‌ విలువపై ప్రభావం పడనుంది.

 క్రికెటర్ల ఆదాయంపై కూడా:

క్రికెటర్ల ఆదాయంపై కూడా:

ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు అంత ఆసక్తికరంగా కొనసాగడం లేదు. ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించకుంటే ఐపీఎల్‌ మజాగా అనిపించకపోవచ్చు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఫ్రాంచైజీలు ఖాళీ స్టేడియాల్లో ఆటకు అంగీకరిస్తున్నాయి. అయితే విదేశీ ఆటగాళ్ల లేకుండా నిర్వహించడానికి మాత్రం ససేమిరా అంటున్నాయి. దాదాపు 60 మంది విదేశీ స్టార్లు ఐపీఎల్‌ ఆడాల్సి ఉంది. వాణిజ్య వీసాలు రద్దు చేయడంతో ఏప్రిల్‌ 15 వరకు వీరు భారత్‌కు రాలేరు. అప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేస్తారు. ఐపీఎల్‌ వేతనాల్లో 46 శాతం విదేశీయులకే చెల్లిస్తున్నారు. టోర్నీ రద్దుతో క్రికెటర్ల ఆదాయంపై ప్రభావం పడుతుంది.

Story first published: Sunday, March 15, 2020, 19:43 [IST]
Other articles published on Mar 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+