Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: పింక్‌బాల్ టెస్ట్‌గా విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్‌

BCCI to host Virat Kohlis 100th Test as Pink Ball Test Match
Virat Kohli - Don't Need To Be A Captain To Be A Leader

టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ త‌న కెరీర్‌లో ఆడ‌బోయే 100వ టెస్టు మ్యాచ్‌కు బీసీసీఐ ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేస్తోంది. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ శ్రీ‌లంక‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు మ్యాచ్‌తో కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా నిల‌వ‌బోతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 25 నుంచి శ్రీ‌లంక‌తో జ‌ర‌గనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ను కోహ్లీకి ప్ర‌త్యేకంగా నిలిచిపోయేలా చేసేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం ఆ టెస్ట్ మ్యాచ్‌ను పింక్‌బాల్ టెస్ట్‌(డే అండ్ నైట్‌)గా నిర్వ‌హిస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీనే అధికారికంగా ప్ర‌క‌టించాడు. దీంతో కోహ్లీ త‌న‌ కెరీర్‌లో ఈ పింక్‌బాల్ టెస్ట్ మ్యాచ్‌తో 100 టెస్టు మ్యాచ్‌ల క్ల‌బ్‌లోకి చేర‌బోతున్నాడన్న‌మాట‌. ఇందుకోసం బీసీసీఐ త‌గిన ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఈ ఏర్పాట్ల‌తో కోహ్లీకి బీసీసీఐకి మ‌ధ్య విబేధాలున్నాయ‌నే వార్త‌ల‌కు కూడా చెక్ పెట్టాల‌నే ప్ర‌యత్నం జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

నిజానికి విరాట్ కోహ్లీ త‌న 100వ టెస్ట్ మ్యాచ్‌ను ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనే ఆడాల్సి ఉంది. కానీ ఆ ప‌ర్య‌ట‌న‌లో కోహ్లీ గాయం కార‌ణంగా రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. దీంతో కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్ట్‌తో 100 టెస్టుల రికార్డు అందుకునే అవ‌కాశాన్ని అప్పుడు కోహ్లీ కోల్పోయాడు. దీంతో స్వ‌దేశంలో శ్రీ‌లంక‌తో జ‌రిగే తొలి టెస్ట్ మ్యాచ్‌తో కోహ్లీ 100 టెస్టుల‌ క్ల‌బ్‌లో చేర‌బోతున్నాడు. దీంతో కోహ్లీ ఆడ‌బోయే ఈ వందో టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే సెంచ‌రీ కూడా చేసి చాలా కాలం అవ‌డంతో 100వ టెస్టులో కోహ్లీ సెంచ‌రీ కొట్టాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌లో ఫిబ్ర‌వ‌రి 25 నుంచి ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇరుజ‌ట్ల మ‌ధ్య‌ 2 టెస్టు మ్యాచ్‌లు, 3 టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా 25 నుంచి బెంగ‌ళూరు వేదిక‌గా తొలి టెస్ట్ మ్యాచ్‌, మార్చి 5 నుంచి మొహాలీ వేదిక‌గా రెండో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 13, 15, 18వ తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే 25 నుంచి బెంగ‌ళూరులో జ‌రిగే తొలి టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని గంగూలీ సూచ‌న ప్రాయంగా తెలిపాడు.

Story first published: Thursday, February 3, 2022, 16:58 [IST]
Other articles published on Feb 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+