Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. మ్యాచ్ చూడటానికి వస్తే ఇవి ఫ్రీ!

క్రికెట్ ఫ్యాన్స్ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లు చూడడం కోసం స్టేడియాలకి వచ్చే ప్రేక్షకులకు మినరల్ వాటర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లోని మొత్తం 10 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగబోతున్నాయి.

అందులో నరేంద్ర మోడీ స్టేడియం, మోటేరా (అహ్మదాబాద్), M చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు), MA చిదంబరం స్టేడియం(చెన్నై), అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం(ఢిల్లీ), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ధర్మశాల), భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం( లక్నో), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(హైదరాబాద్), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(పుణె), ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా), వాంఖడే స్టేడియం(ముంబై) ఉన్నాయి.

World Cup 2023:

ఈ స్టేడియాలన్నింటిలో వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఫ్యాన్స్ కోసం మినరల్ వాటర్ ఫ్రీగా అందించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా గురువారం నాడు ఎక్స్ (X) వేదికగా ప్రకటించాడు. '2023 ప్రపంచకప్‌లో తొలి బంతి పడడం కోసం మనందరం ఎదురుచూస్తున్న సందర్భంగా ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న ప్రతి స్టేడియంలో ఫ్యాన్స్ కోసం ఉచితంగా మినరల్ వాటర్ అందించబోతున్నాం' అని చెప్పాడు.

అలాగే ఈ విషయాన్ని ప్రకటించడం తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. 'అందరూ దాహం తీర్చుకుంటూ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయండి. ఈ ప్రపంచకప్‌‌లో మరపురాని మధురస్మృతులను మిగుల్చుకుందాం' అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో మంచి ఎండలు ఉండటంతో ఇది తమకు చాలా మంచి వార్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇది బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు.

Story first published: Thursday, October 5, 2023, 15:23 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+