Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంపైరింగ్ తప్పులపై ఫిర్యాదు: బిసిసిఐ


ముంబై: ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య సిడ్నీలో జరిగిన రెండో టెస్టు మ్యాచులో తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. తొలి రోజు ఆటలో అంపైర్ల తప్పుడు నిర్ణయంపై అధికారికంగా ఏ విధమైన నిరసన వ్యక్తం చేయకూడదని బిసిసిఐ అనుకుంది. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయాలని బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్ అధికార వర్గాలను ఆదేశించారు. ఈ మేరకు ఐసిసికి నేడే ఒక లేఖ రాయనున్నట్లు బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.

అంపైరింగ్ ప్రమాణాలు అంగీకారయోగ్యమైనవి కావని, అవి తటస్థంగా ఉన్నాయని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఇద్దరు అంపైర్లు స్టీవ్ బుక్నర్ (వెస్టిండీస్), మార్క్ బెన్సన్ (ఇంగ్లాండు)కూడా భారత్ కు వ్యతిరేకంగా ఘోరమైన నిర్ణయాలను ప్రకటించారని ఆయన విమర్శించారు. ఐసిసి సాంకేతిక కమిటీ సభ్యుడైన సునీల్ గవాస్కర్ కూడా అంపైర్ల నిర్ణయాలను తప్పు పట్టారని ఆయన గుర్తు చేశారు. తొలి రోజు ఆటలో సైమండ్స్ రెండు సార్లు అవుటైనప్పటికీ అంపైర్లు నాటవుటుగా ప్రకటించారు. దాంతో సిరీస్ ను సమం చేసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో హస్సీ విషయంలోనూ అలాగే జరిగింది.
Story first published: Sunday, January 6, 2008, 13:59 [IST]
Other articles published on Jan 6, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+