INDvsAUS : చేతన్ శర్మపై వేటు తప్పదు.. ఇక ఎవరూ నమ్మలేరంటున్న బీసీసీఐ!

ప్రస్తుతం భారత క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారిన అంశం టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ. జీన్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో నోరు జారిన చేతన్ శర్మ.. నోటికి వచ్చిన అడ్డమైన వాగుడంతా వాగేశాడు. దీంతో అతనిపై బీసీసీఐ పెద్దలతోపాటు ఆటగాళ్లు కూడా మండిపడుతున్నట్లు సమాచారం. కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాల గురించి కూడా చేతన్ శర్మ ఈ స్టింగ్ ఆపరేషన్లో చెప్పాడు. గంగూలీ ఒక్కడే కాదని, తమ బోర్డు మొత్తం కోహ్లీకి వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చాడు.

జట్టు సెలెక్షన్ మీటింగ్!?
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి రెండు టెస్టులకు జట్టును ఇప్పటికే ప్రకటించడంతో వాళ్లే ఈ మ్యాచులు ఆడతారు. అయితే మిగతా రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం మరోసారి బోర్డు సభ్యులంతా సమావేశం అవ్వాలి. ఈ స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. మీటింగ్‌లో సభ్యులు అతన్ని గౌరవిస్తారా? తమ వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటారా? అని బీసీసీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఎవడూ పట్టించుకోరు..
అసలు చేతన్ శర్మతో ఏ ఆటగాడూ పెద్దగా మాట్లాడడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ట్రైనింగ్ సెషన్ సమయంలో చేతన్ వెళ్లినా కూడా అతన్ని ఎవరూ పట్టించుకోరని, అతను మైదానంలో ఒక మూల నిలబడి ఉంటాడని కొందరు చెప్తున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ఇలా ఎవరైనా సీనియర్ ఆటగాడు.. ఎప్పుడైనా చేతన్‌తో మాట్లాడుతూ కనిపించాడా? అని ప్రశ్నిస్తున్నారు. చేతన్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వట్టి చెత్త వాగుడే అని బీసీసీఐ పెద్దలు మండిపడుతున్నారు.

స్టార్ ఆటగాళ్లపై అభాండాలు..
తను ఇలా వాగడానికి కారణాలు, తన వ్యాఖ్యలను డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని చేతన్‌కు ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోందట. అయితే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి వారితో మళ్లీ అతను సమావేశమై జట్టు గురించి చర్చించగలడా? అనేది అనుమానమే. ఎందుకంటే వీరిపై కొన్ని అభాండాలు వేశాడు. వాళ్లందరూ వచ్చిన తన ఇంట్లో కూర్చొని, భవిష్యత్తు గురించి గంటల తరబడి చర్చిస్తారని చెప్పుకున్నాడు. ఇలాంటి మాటలు విన్న తర్వాత అతనికి వాళ్ల నుంచి గౌరవం దక్కడం అసాధ్యమనే చెప్పాలి.

బ్యాన్ గ్యారంటీ?
అసలు ఆటగాళ్లు ఎవరైనా ఇలాంటి వ్యక్తితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారా? అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ క్రమంలోనే చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పించాలని, అతనిపై బ్యాన్ విధించాలని బీసీసీఐ భావిస్తోందట. దీని కోసం ఇప్పటికే కావలసిన చర్యలన్నీ తీసుకున్నారట.
మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. కానీ చేతన్‌ను మాత్రం సాగనంపడం గ్యారంటీ అని వార్తలు వస్తున్నాయి. అతనితో మాట్లాడేందుకు మిగతా సెలెక్టర్లు కూడా సందేహిస్తున్నారని సమాచారం.
ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయడానికి త్వరలోనే సెలెక్షన్ కమిటీ సమావేశం అవ్వాల్సి ఉంది. ఈ మీటింగ్‌లో కూడా అతను పాల్గొనకుండా బ్యాన్ చేస్తారని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications