కోల్‌కతా: ఛాంపియన్స్ లీగ్ టీ 20ని మరింత బెట్టర్ చేసేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని, మినీ ఐపీఎల్ పైన ఎలాంటి ఆలోచన లేదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ సోమవారం చెప్పాడు. ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ) తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఖండించాడు.
ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పాడు. గతవారం ఛాంపియన్స్ లీగ్ టీ 20ని పక్కన పెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించాడు. అవన్నీ రూమర్లు అన్నాడు.

ప్రస్తుతం తాము ఛాంపియన్ లీగ్‌కు మరిన్ని మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నామన్నాడు. ఇప్పటి వరకూ ఛాంపియన్ లీగ్‌ను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌లలో మాత్రమే నిర్వహించామని, అయితే మరిన్ని దేశాలలో చాంపియన్ లీగ్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు.
క్రికెట్‌కు మరింత వన్నె తెచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పాడు. తాము ఇప్పటికీ సీఎల్టీ 20కే కట్టుబడి ఉన్నామని, త్వరలో దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఐపీఎల్ బాగా ముగిసిందని, మినీ ఐపీఎల్ ఆలోచన లేదన్నాడు. సీఎల్టీ పైనే తమ దృష్టి అని చెప్పాడు.