For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రింకు సింగ్‌పై మూడు నెలలు సస్పెన్షన్ వేటు వేసిన బీసీసీఐ

BCCI suspends Rinku Singh for three months

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌‌కు చెందిన యువ క్రికెటర్ రింకూ సింగ్‌‌పై బీసీసీఐ వేటు వేసింది. వచ్చే మూడు నెలలు అతడు ఏ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకూడదంటూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి తీసుకోకుండా ఇటీవల అబుదాబిలో జరిగిన టీ20 టోర్నీలో ఆయన పాల్గొనడమే అతడి వేటుకు కారణమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బోర్డు నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా రింకు సింగ్‌పై తాత్కాలిక నిషేధాన్ని విధించామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు సింగ్ ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 21 ఏళ్ల రింకు సింగ్ ఇప్పటి వరకు 19 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. వీటితో పాటు 24 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Thursday, May 30, 2019, 17:50 [IST]
Other articles published on May 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+