
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. వారిని 'అన్‌సంగ్ హీరోలు' అని సంబోధించిన బీసీసీఐ సోమవారం ₹1.25 కోట్ల ప్రైజ్ మనీని వారికి అందించనున్నట్లు ప్రకటన చేసింది. 'టాటా ఐపీఎల్ 2022లో అత్యుత్తమ గేమ్‌లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్‌కు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సీజన్‌లో 6 స్టేడియాలను మ్యాచ్ ల కోసం అద్భుతంగా తీర్చిదిద్దిన మా క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ నిజంగా అన్ సంగ్ హీరోలు' అని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జయ్ షా ట్వీట్‌లో తెలిపారు.
' ఈ ఐపీఎల్లో కొన్ని అత్యుత్తమ, ఉత్కంఠభరిత మ్యాచ్ లు చూశాం. అందుకు తగ్గ పిచ్‌లను రెడి చేసిన గ్రౌండ్స్ మెన్, క్యూరెటర్ల కృషికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. బ్రబౌర్న్, వాంఖడే, డివై పాటిల్, పూణేలోని ఎంసీఏ స్టేడియాల్లో ఒక్కో స్టేడియం గ్రౌండ్స్ మెన్, క్యూరేటర్లకు 25లక్షలు చొప్పున నజరానా అందించడానికి సంతోషింస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోడీ స్టేడియాల్లో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్‌లకు 12.5లక్షలు చొప్పున నజరానా అందిస్తాం.' అని జయ్ షా ట్వీట్లో పేర్కొన్నారు. తొలిసారిగా గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇకపోతే ఐపీఎల్లో మొత్తం 70లీగ్ మ్యాచ్‌లు మహారాష్ట్రలోని నాలుగు వేదికలలో జరిగాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాటైటిల్‌ను గుజరాత్ ద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరిగాయి.
ఐపీఎల్ 2022 సీజన్ టైటాన్స్ సగర్వంగా తమ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకే పరిమితం చేసిన హార్దిక్ సేన.. ఛేదనలో ఎంతో జాగ్రత్తగా ఆడి ట్రోఫీని ఒడిసిపట్టింది. 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) అద్భుతంగా ఆడి గుజరాత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.