Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni Special gift: ధోనీకి బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్.. ‘THALA ఫర్ ఏ రీజన్’ఫ్యాన్స్ హ్యాపీ

దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ధోనీ జెర్సీ నంబర్ 7ను ఏ ఇతర ఆటగాళ్లకు ఇవ్వకుండా రిటైర్ చేసింది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవకు గుర్తింపుగా ఏడో నంబర్‌ను ప్రత్యేకంగా ఉంచనుంది. గతంలో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10ని కూడా బీసీసీఐ రిటైర్ చేసిన విషయం తెలిసిందే.

ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీల్లో భారత్‌ను ధోనీ విశ్వవిజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అందుకుంది. మహీ తన కెరీర్ లో 2019 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో చివరిసారిగా టీమిండియా జెర్సీ ధరించాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడుతున్నాడు.

BCCI special gift for MS Dhoni. No. 7 Jersey Retired fans are happy saying THALA for a reason

''ప్రస్తుత ఆటగాళ్లకు, యువ ప్లేయర్లకు ధోనీ జెర్సీ నంబర్ 7ను సెలక్ట్ చేసుకోవద్దని బీసీసీఐ చెప్పింది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గానూ ధోనీ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే సచిన్ జెర్సీ 10వ నంబర్‌కు రిటైర్మెంట్ చేశారు'' అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.

కాగా, మరోవైపు ఈ విషయంపై ధోనీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా 'తలా ఫర్ ఏ రీజన్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్,స్విగ్గీ,యూట్యూబ్‌తో సహా గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ పేరులో 7 ఉందంటూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా 7 నంబర్‌కు రిటైర్మెంట్ అని వచ్చిన ఇవాళ తేదీ (15-12-2023) కూడా కలిపితే సెవెన్ వస్తుందని.. తలా ఫర్ ఏ రీజన్ అని పోస్టులు పెడుతున్నారు.

Story first published: Friday, December 15, 2023, 12:09 [IST]
Other articles published on Dec 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+