Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత కెప్టెన్ ధోనీ ఇష్యూ: ఐసిసిపై బిసిసిఐ మండిపాటు

Mahendra Singh Dhoni
న్యూఢిల్లీ: అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి (యూడీఆర్‌ఎస్‌)పై వివాదం ముదిరింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ ధోనీని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ డేవ్‌ రిచర్డ్సన్‌ విమర్శించడంపై బీసీసీఐ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హరూన్‌ లొర్గాత్‌కు ఘాటైన లేఖ రాసింది. బోర్డు కార్యదర్శి శ్రీనివాసన్‌ లేఖలో యూడీఆర్‌ఎస్‌ లోపాలను ఎత్తి చూపాడు. రిచర్డ్సన్‌కు ధోనీని విమర్శించే హక్కు లేదని, మరోసారి అలా మాట్లాడకుండా రిచర్డ్సన్‌ను కట్టడి చేయాలని కోరింది. ధోనీ యూడీఆర్‌ఎస్‌లో లోపాలను మాత్రమే ఎత్తిచూపాడని, ప్రపంచం మొత్తం చూసిందని బిసిసిఐ ప్రతినిధి శ్రీనివాసన్‌ అన్నాడు.

ప్రపంచకప్‌ జరుగుతున్నప్పుడు, మ్యాచ్‌ అనంతర విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆటగాణ్ని ఐసీసీ ప్రతినిధి విమర్శించడమంటే అతణ్ని ఒత్తిడిలోకి గురిచేయడమేనని, రిచర్డ్సన్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆయన చెప్పాడు. యూడీఆర్‌ఎస్‌లో లొసుగులకు భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచే ఉదాహరణని శ్రీనివాసన్‌ లేఖలో అన్నాడు. ఈ విధానం విశ్వసనీయత ప్రశ్నార్థకమని చెప్పాడు. తాము ఎప్పటినుంచో యూడీఆర్‌ఎస్‌ను వ్యతికేకిస్తున్నామని తెలిపాడు.

యూడీఆర్‌ఎస్‌ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. ''ఐసీసీ యూడీఆర్‌ఎస్‌ను కొనసాగించొచ్చు. కానీ నిబంధనలను సులభతరం చేయాలి. నిబంధనల పుస్తకం చాలా పెద్దది. చదవడానికి చాలా సమయం పడుతుంది. ఈ రోజుల్లో క్రికెటర్లకు అంత సమయం లేదు. కాబట్టి ఆటగాళ్లు పుస్తకంలోని అన్ని వివరాలూ చదవాలనడం అన్యాయం'' అని అక్రమ్‌ చెప్పాడు. ధోనీ వాదనను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా బలపరిచాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+