Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిసిసిఐ షోకాజ్: వెంగీ తిరుగుబాటు


Vengsarkarముంబయి: చీఫ్ సెలెక్టర్ వెంగ్ సర్కార్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. వెంగ్ సర్కార్ పత్రికలకు కాలమ్స్ రాయడంపై ఈ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో వెంగ్ సర్కార్ కు బిసిసిఐకి మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాలమిస్టుగా కొనసాగాలనుకుంటే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయాలని బిసిసిఐ వెంగ్ సర్కార్ కు సూచించింది. బిసిసిఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వెంగ్ సర్కార్ హిందీ దినపత్రిక అమర్ ఉజాలాకు, మరాఠీ దినపత్రిక సకాల్ కు కాలమ్స్ రాశారు.

అయితే బిసిసిఐపై వెంగ్ సర్కార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. తాను గత 15 ఏళ్లుగా కాలమ్స్ రాస్తున్నానని ఆయన చెప్పారు. కాలమ్స్ తన జీవనోపాధికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. జట్టు ఎంపిక గురించి మాత్రం తాను పత్రికల్లో రాయబోనని ఆయన స్పష్టం చేశారు. కాలమ్స్ రాయడాన్ని మాత్రం వదులుకోనని ఆయన అన్నారు. కాలమ్స్ రాయడానికి తనకు బిసిసిఐ అనుమతి ఇచ్చిందని కూడా ఆయన వాదిస్తున్నారు. బిసిసిఐ ఇటీవల సెలెక్టర్లకు 7 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. పత్రికలకు కాలమ్స్ రాయకూడదనేది వాటిలో ఒకటి.
Story first published: Thursday, November 22, 2007, 23:53 [IST]
Other articles published on Nov 22, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+