వర్షాలు: విజయవాడ మ్యాచ్‌లు బెంగళూరుకి తరలిపోయాయి

హైదరాబాద్: భారీ వర్షాలతో విజయవాడ వేదికగా జరగాల్సిన చతుర్ముఖ సిరిస్‌ను బీసీసీఐ బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. విజయవాడతోపాటు కృష్ణా జిల్లా మూలపాడు వేదికగా జరగాల్సిన సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లు వర్షాలతో రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఆదివారం భారత్-ఎ, భారత్-బి జట్ల మధ్య మ్యాచ్ కూడా సాధ్యపడలేదు. దీంతో వేదికలను ఆలూరు (కర్ణాటక, హసన్ జిల్లా), బెంగళూరుకు తరలించాలని బీసీసీఐ నిర్ణయించింది. మారిన షెడ్యూల్ ప్రకారం చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌తో కలిపి 5 మ్యాచ్‌లు, మిగిలిన 4 మ్యాచ్‌లు ఆగస్టు 23, 25, 27, 29న ఆలూరులో జరగనున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న ఈ చతుర్ముఖ సిరిస్‌లో ఇండియా ఏ, ఇండియా బి, దక్షిణాఫ్రికా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు పోటీ పడుతున్నాయి.
Story first published: Monday, August 20, 2018, 12:37 [IST]
Other articles published on Aug 20, 2018
Read in English: BCCI shifts matches to Bengaluru
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications