మ్యాచ్ ఆడడానికి కోహ్లీ రెడీ.. మరి మీరు కూడా సిద్ధమా?

గవాహటి: కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడుతున్నాయి.

కోహ్లీకి గాయం
తొలి టీ20 మ్యాచ్ కోసం శనివారం టీమిండియా జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అందరూ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎడమ చేతి చిటికెన వేలుకు బంతి బలంగా తాకింది. వెన్తనె టీమ్ ఫిజియో నితిన్ పటేల్ అతడికి ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం కోహ్లీ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. దీంతో కోహ్లీ తొలి టీ20 మ్యాచ్ ఆడడం అనుమానమేనని వార్తలు చక్కర్లు కొట్టాయి.

కెప్టెన్ కోహ్లీ రెడీ.. మరి మీరు?
కోహ్లీ గాయంపై బీసీసీఐ ఆదివారం స్పందించింది. విరాట్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు.. అభిమానులను ఉద్ధేశించి దీనికి ఓ మంచి క్యాప్షన్ ఇచ్చింది. 'కెప్టెన్ కోహ్లీ రెడీ.. మరి మీరు?' అని రాసుకొచ్చింది. తొలి టీ20 మ్యాచ్ ఆడడానికి కోహ్లీ రెడీగా ఉన్నాడు. చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని బీసీసీఐ ఉద్దేశం.

అభిమానుల సంతోషం
బీసీసీఐ ట్వీట్‌తో అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. కోహ్లీ మ్యాచ్ ఆడడం ఖాయమే అని సంబరపడుతున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తెగ షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'హామ్మయ్యా కోహ్లీ ఆడుతున్నాడు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'కోహ్లీ సేఫ్' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

అభిమానికి విరాట్ ఫిదా
విరాట్ కోహ్లికి దేశంలోనే గాక విదేశాల్లోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. గవాహటికి చెందిన కోహ్లీ అభిమాని ఒకరు.. పాడైన సెల్‌ఫోన్ పరికరాలతో అతడి ఫొటోను రూపొందించాడు. ఇది చూడడానికి సాధారణ పేపర్‌పై గీసిన బొమ్మలా ఉండడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న కోహ్లీ.. తన అభిమాని దగ్గరికెళ్లి అతడు రూపొందించిన తన చిత్రాన్ని చూసి ఫిదా అయ్యాడు. ఈ చిత్రంపై విరాట్ తన సైన్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications