BCCI SGM Meeting రేపే: సత్తాకు సిసలు పరీక్ష: అజెండా కంప్లీట్ లిస్ట్ ఇదే

ముంబై: దేశంలో ప్రాణాంతక వైరస్ మహోత్పాన్ని సృష్టించడం ఆరంభమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్, 14వ ఎడిషన్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)ను ముప్పతిప్పలు పెడుతోొంది..మూడు చెరువుల నీళ్లను తాగిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ (T20 World Cup) టోర్నమెంట్‌ను నిర్వహించడం ఒక ఎత్తయితే.. ఐపీఎల్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం మరో ఎత్తుగా మారింది. ఈ రెండూ బీసీసీఐకి కఠిన సవాళ్లను విసురుతున్నాయి. బీసీసీఐ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ క్యాలెండర్లను నిర్దేశించుకోవడం ఐపీఎల్ 2021 ఫేస్ 2 నిర్వహణకు అడ్డంకిగా మారినట్టయింది.

బీసీసీఐ ఎస్జీఎం కీలక భేటీ రేపే..
ఈ పరిణామాల మధ్య బీసీసీఐ శనివారం ప్రత్యేకంగా సమావేశం (BCCI SGM Meeting) కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ఆరంభం కావొచ్చు. బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షా సహా గవర్నింగ్, జనరల్ బాడీ భేటీ అవుతుంది. ఇందులో తీసుకునే నిర్ణయాలే ఐపీఎల్ 2021 ఫేస్ 2 భవితవ్యాన్ని శాసించబోతోన్నాయి. దీనితో పాటు- టీమిండియా పర్యటనల షెడ్యూల్‌పైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

ఎమిరేట్స్ వెళ్లాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి..
ఐపీఎల్ 2021 ఫేస్ 2, టీ20 ప్రపంచకప్..ఈ రెండు మెగా టోర్నమెంట్ల నిర్వహణతో పాటు ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలనే అంశం కూడా ఎస్జీఎం భేటీ సమక్షానికి చర్చకు రానుంది. ఈ రెండు మెగా టోర్నమెంట్లనూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాల్సి ఉంటుందని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం.. భారత్ నుంచి ఎవరూ తమ దేశానికి వచ్చినా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకుని తీరాల్సి ఉంటుంది. రెండో డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఆధారాలను చూపితే గానీ.. ఆ దేశం భారత్ నుంచి వచ్చే వారినిక తమ గడ్డ మీద అడుగు పెట్టనివ్వదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్, ఈ టోర్నీ నిర్వహణతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించాలనే విషయంపైనా బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

ప్రొటీస్, కివీస్‌తో సిరీస్‌లపై..
ఐపీఎల్ 2021 ఫేస్ 1 నిర్వహణ కోసం బీసీసీఐ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత మళ్లీ ఈ రెండు దేశాలతో టీమిండియా ఆడాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా స్పెషల్ జనరల్ మీటింగ్‌లోనే ఖరారు కావచ్చని సమాచారం. షెడ్యూల్ ఖరారు కానప్పటికీ- వాటి సిరీస్‌లను కొనసాగించడంపై ఆ రెండు దేశాల క్రికెట్ బోర్డులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీనిపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదు.

విండీస్ వీరులు కూడా డౌటే..
ఐపీఎల్ 2021 ఫేస్ 2లో విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశాలకు దశలవారీగా తెరపడుతోంది. ఇంగ్లాండ్ జట్టు సెప్టెంబర్ 19 లేదా 20వ తేదీల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనలకు వెళ్లబోతోంది. ఆ తరువాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడేది అనుమానమే. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు టైట్ షెడ్యూల్‌ను ఎదుర్కొంటోన్నారు. క్రిస్ గేల్, ఫాప్ డుఫ్లెసిస్ వంటి ప్లేయర్లు కరేబియన్ ఛాంపియన్ లీగ్ 2021 (CPL 2021)లో ఆడాల్సి ఉంది. వారందరూ ఐపీఎల్ 2021 ఫేస్ 2లో ఆడటానికి అంగీకరించినప్పటికీ- క్వారంటైన్‌లో కనీసం రెండువారాల పాటు గడపాల్సి రావడం కూడా అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 మిగిలిపోయిన మ్యాచ్‌ల నిర్వహణ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠతకు గురి చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications