For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రావిడ్ అవుట్- టీమిండియాకు కొత్త కోచ్‌

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇక మాజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ మొదలు పెట్టింది కూడా. టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయనుంది.ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌ ఆడబోతోంది టీమిండియా. ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వారం రోజుల తరువాత అంటే జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

BCCI set to change Team India s head coach after t20 World Cup 2024

మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది.

దీని రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ- టీమిండియాకు కొత్త కోచ్ రావడం మాత్రం ఖాయమైనట్టే. ఈ వరల్డ్ కప్ ముగిసిన తరువాత కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది బీసీసీఐ. కొత్త కోచ్ కోసం త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. దీనికోసం ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌ను జారీ చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్ వరకు కొనసాగుతుందని, ఆ తరువాత కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని, దీనికోసం యాడ్స్ ఇస్తామని అన్నారు. ఆసక్తి ఉంటే రాహుల్ ద్రావిడ్ కూడా దరఖాస్తు దాఖలు చేయొచ్చని చెప్పారు.

విదేశీ ఆటగాడిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసే అవకాశాలను జై షా కొట్టి పారేయట్లేదు. కోచ్‌గా ఎవరు ఉండాలి? ఫారిన్ ప్లేయర్‌ను తీసుకోవాలా? వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని, దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరహాలో వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్‌కు ఒకరు, టెస్ట్ ఫార్మట్‌కు మరొకరిని హెడ్ కోచ్‌‌లుగా అపాయింట్ చేయకపోవచ్చని వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, May 10, 2024, 13:23 [IST]
Other articles published on May 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+