Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టోటల్ ఛేంజ్?

రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంటోంది. దాదాపుగా అన్ని జట్లు కూడా డజను చొప్పున మ్యాచ్ లు ఆడేశాయి. ఇంకొద్ది రోజుల్లో ప్లేఆఫ్స్ మొదలవుతాయి. మే 31వ తేదీన ఫైనల్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. ఇంకో మూడు బెర్తుల కోసం జట్లు పోరాడుతున్నాయి.

ఇది ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్, వన్డే సిరీస్ మొదలవుతుంది. జూన్ 6 నుంచి 20వ . తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్‌కు జట్టును మంగళవారం ప్రకటించనుంది. గువాహటిలో భేటీ కానుంది సెలెక్షన్ కమిటీ. జూన్ 6న న్యూ చండీగఢ్‌లో ప్రారంభమయ్యే టెస్టుకు జట్టును ఎంపిక చేయనుంది.

BCCI Set to Announce India Squad for Afghanistan Test as Huge Possible to Shami is likely to return

ప్రస్తుతం అందరి చూపూ దీని మీదే ఉంది. జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ అయింది. వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడట్లేదు. అతని పేరును పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చు. బుమ్రా అందుబాటులో లేకపోతే.. మరో వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకోవచ్చు. అనితో పాటు ప్రసిద్ధ్ పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మహ్మద్ షమీ ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన షమీ 10 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించుకుంటోన్నాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 2/9. ప్రత్యర్థి జట్టు ఆఫ్ఘనిస్తాన్ కావడం వల్ల షమీకి ఓ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

అలాగే జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ దార్‌కు టీమిండియా తరపున తొలి పిలుపు అం//దే అవకాశం ఉంది. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ గెలవడంలో అకిబ్ కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వన్డే జట్టులో ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. హర్షిత్ రాణా గాయంతో దూరం అయ్యాడు. వన్డేల కోసం మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాను తీసుకోకపోవచ్చు. ప్రిన్స్ యాదవ్‌ కు ఆ అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది.

Story first published: Monday, May 18, 2026, 13:59 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+