
కోచికి తప్పకుండా పరిహారం చెల్లించాల్సిందే
‘మేమిప్పుడు కోచికి తప్పకుండా పరిహారం చెల్లించాల్సిందే. కోచిపై పోరాడటానికి మాకు అన్నిదారులు మూసుకుపోయాయి. మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పే మాకు గతంలో వ్యతిరేకంగా వచ్చింది. అటువంటి సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం అనే నిర్ణయం సరైనది కాదు. మాకిప్పుడు మరో అవకాశం లేదు' అని ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సమస్యల్లా ఎంత చెల్లించాలనే? ఇప్పుడు కోచి టస్కర్స్ రూ.600 కోట్లకు కూడా తగ్గని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు.

అసలు వివాదానికి కారణం ఇదీ
వార్షిక ఫీజులో భాగంగా బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ 2011లో కోచి టస్కర్ ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేశారు. బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకిస్తున్నా మొండితనంతో శశాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

బ్యాంకు గ్యారెంటీ సొమ్ము తీసుకుంటామన్న కోచి
తమతో చేసుకున్న ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించినందుకు గాను బ్యాంకు గ్యారెంటీ సొమ్ము తీసుకుంటామని కోచి కోరింది. అందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో రూ.300 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో తామెంతో నష్టపోయామని కోచి టస్కర్స్ కోర్టు కెక్కింది.

పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు
దానిలో భాగంగా ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2015లో కొచ్చి నష్టపరిహారంగా రూ. 384. 83 కోట్లతో పాటు ఈ మొత్తానికి 18 శాతం వడ్డీ చొప్పున నాలుగేళ్లకు అయ్యే మొత్తాన్ని కలిపి చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది.

కోచికి రూ.850 కోట్లు చెల్లించడానికి సిద్దమైన బీసీసీఐ
బీసీసీఐ రెండేళ్లుగా కోచికి డబ్బులు చెల్లించకపోగా, ఫ్రాంచైజీని తిరిగి ఐపీఎల్‌లోకి అనుమతించలేదు. అయితే ఈ మొత్తం కలిపి ఇప్పుడు రూ. 900 కోట్లు అయింది. కోర్టు ఫీజుల కింద ఫ్రాంచైజీకి మరో రూ. 72 లక్షలనూ చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న బీసీసీఐ కోచికి రూ.850 కోట్లు చెల్లించడానికి సిద్దమైంది.


Click it and Unblock the Notifications











