Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ని కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం వల్లే అతనికి షోకాజ్

Sanjay Dixit
న్యూఢిల్లీ: రాజస్దాన్ రాయల్స్ పిచ్‌పై బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రాజస్దాన్ రాయల్స్‌తో జరిగినటువంటి మ్యాచ్‌లో అసహానాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జైపూర్ మాన్ సింగ్ స్టేడియం పిచ్‌పై కాంట్రవర్సీలు వస్తునే ఉన్నాయి. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మంగళవారం రాజస్దాన్ రాయల్స్ సెక్రటరీ సంజయ్ దీక్షిత్‌కి షోకాజ్ నోటీసులు అందజేసింది. పిచ్‌కి సంబంధించిన రిపోర్ట్‌తో పాటు రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్ అయిన షేన్‌వార్న్‌తో జరిగిన గోడవకు కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఈ వివరణ మొత్తం పదహేను రోజులలో స్పందించివలసిందిగా కోరడం జరిగింది.

అసలు సంజయ్ దీక్షిత్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి ముఖ్యకారణం ఏమిటంటే రాజస్దాన్ రాయల్స్ సెక్రటరీ అయిన సంజయ్ దీక్షిత్ తన ట్విట్టర్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌‌ని కించపరుస్తూ రాసినటువంటి కామెంట్స్ అని అంటున్నారు. ఇదిమాత్రమే కాకుండా రాజస్దాన్ రాయల్స్‌తో జైపూర్‌ మాన్ సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తలపడినప్పుడు 94 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సచిన్ టెండూల్కర్ జైపూర్ పిచ్‌‌ సరిగ్గా లేదని విమర్శించారు. దాంతో జైపూర్ పిచ్‌పై కాంట్రవర్సీలు మొలయ్యాయి.

ఆరోజు జరిగినటువంటి మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్ కేవలం 94 పరుగులకే ఆల్ అవుట్ కాగా, ఈ లక్ష్యాన్ని రాజస్దాన్ రాయల్స్ 18.1 ఓవర్లలలో ఛేదించారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ పిచ్ సరిగ్గా లేకపోవడం వల్ల బాల్ తక్కువ ఎత్తుకే పరిమితమైందని అన్నారు. ఇక రాజస్దాన్ రాయల్స్ సెక్రటరీ సంజయ్ దీక్షిత్ తన ట్విట్టర్‌లో ఏమని ట్వీట్ చేశారంటే సచిన్ పుల్ టాస్ బాల్‌కి అవుట్ అవ్వడం జరిగింది. పిచ్ సరిగ్గా లేదని అనడం సచిన్‌కు భావ్యం కాదని, ఇది మాత్రమే కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి పంజాబ్ లీగ్ మ్యాచ్‌లో సచిన్ కేవలం 51పరుగులకే అవుట్ అవ్వడం జరిగిందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇలాంటి విషయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసినందుకు గాను బిసిసిఐ సంజయ్ దీక్షిత్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందని సమాచారం.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+