For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భలే ఛాన్స్ కొట్టిన జై షా - ఐసీసీలో కీలక పదవి: రూ.వేల కోట్ల లావాదేవీలు..!!

BCCI Secretary Jay Shah elected as Chief of the ICCs Finance and Commercial Affairs Committee

మెల్‌బోర్న్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కీలక పదవి భారత్‌కు దక్కింది. ప్రస్తుతం ఐసీసీలో ఛైర్మన్ సహా వివిధ కమిటీలకు అధినేతల ఎంపిక కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్లే మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదవి కోసం తొలుత- జింబాబ్వే క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముకుహ్లాని పోటీ పడ్డారు. చివరి నిమిషంలో ఆయన ఈ రేసు నుంచి తప్పుకున్నారు.

ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా..

ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా..

అదే సమయంలో అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికయ్యారు. ఐసీసీ నిర్వహించే వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించేది ఈ కమిటీనే. అలాంటి కమిటీకి అధినేతగా జై షా ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శిగా వ్యవహరిస్తోన్నారు. మొన్నీ మధ్యే ఆయన వరుసగా రెండోసారి ఈ పదవిలో రీ అపాయింట్ అయ్యారు.

ఈ కమిటీ కీ రోల్..

ఈ కమిటీ కీ రోల్..

ఐసీసీలో ఈ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ పాత్ర అత్యంత కీలకం. సభ్య దేశాల మధ్య ఆదాయ భాగస్వామ్యాన్ని నిర్దేశించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఏడాది పొడవునా ఐసీసీ కుదుర్చుకునే ఒప్పందాలు, వివిధ సిరీస్‌లు, టోర్నమెంట్స్‌కు సంబంధించిన ప్రధాన స్పాన్సర్‌షిప్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి ఎప్పుడూ ఐసీసీ బోర్డు సభ్యుడు నేతృత్వం వహిస్తోండటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా జై షా ఎన్నికతో ఐసీసీ బోర్డులో బీసీసీఐకి ప్రాధాన్యతను ఇచ్చినట్టయింది.

 మళ్లీ పూర్వవైభవం..

మళ్లీ పూర్వవైభవం..

ఇదివరకు ఎన్ శ్రీనివాసన్ హయాంలో ఇదే కమిటీకి ఛైర్మన్‌గా భారతీయుడే ఉన్నారు. అనంతరం ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ హయాంలో బీసీసీఐ ప్రాతినిథ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. ఇప్పుడు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నట్టయింది.. తాజాగా చోటు చేసుకున్న జై షా ఎన్నికతో. ఇంతకుముందే- న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన అడ్వొకేట్ గ్రెగ్ బార్క్లే ఐసీసీ ఛైర్మన్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

గ్రెగ్ కంటిన్యూ..

గ్రెగ్ కంటిన్యూ..

గతంలో ఆయన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఐసీసీ ప్రపంచ కప్ 2015కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. తొలిసారిగా 2020 నవంబర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. అదే పదవిలో మళ్లీ పునర్నియామకం అయ్యారు. మరో రెండు సంవత్సరాల పాటు ఆయన ఇదే హోదాలో కొనసాగనున్నారు. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఆయనకు మంచి మెజారిటీ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఐసీసీలో మొత్తంగా 17 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా బార్క్లే నాయకత్వానికే జై కొట్టింది.

Story first published: Saturday, November 12, 2022, 15:15 [IST]
Other articles published on Nov 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+