
ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2022 షెడ్యూల్‌పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్‌ను ఎప్పుడూ నిర్వహించేది, ఎక్కడ నిర్వహించే అంశాలపై బీసీసీఐ సెక్రటరీ జైషా ఓ క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి చివరి వారంలో మొదలై మే చివరి దాకా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలని ప్రాంచైజీలు కోరుకుంటున్నాయని చెప్పారు. కొత్తగా రెండు జట్లు కలిసిన నేపథ్యంలో టోర్నీని భారత్‌లో నిర్వహిస్తేనే బాగుంటుందని తాము కూడా భావిస్తున్నట్లు జైషా తెలిపారు. టోర్నీని భారత్‌లో నిర్వహించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలి పెట్టమని చెప్పారు. అలాగని కరోనా పరిస్థితుల్లో ఆటగాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని ఆయన అన్నారు. అయితే అప్పటికీ కరోనా తగ్గకుంటే మాత్రం ప్రత్యామ్నాయ వేదికలుగా ఐసీఎల్‌ను విదేశాలకు తరలించాల్సి వస్తుందని జైషా వెల్లడించారు.
ఫిబ్రవరి 12, 13న రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు పాల్గొననున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ సారి వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడు అహ్మదాబాద్, లక్నో అనే మరో రెండు కొత్త జట్లు లీగ్‌లో పాల్గొనున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా కాలం తర్వాత ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. చివరిగా 2011లో ఐపీఎల్‌లో 10 జట్లు ఆడాయి.
ఐపీఎల్ వేదికగాపై మాత్రం సందిగ్ధం కొనసాగుతుంది. ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించడం కష్టంగా కనిపిస్తోంది. అయితే ఎక్కువ వేదికలు కాకుండా ఒక ముంబైలో మాత్రమే లీగ్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అందుకు కూడా పరిస్థితులు అనుకూలించకపోతే లీగ్‌ను విదేశాలకు తరలించనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ వేదికలుగా బీసీసీఐ ఇప్పటికే యూఏఈ, శ్రీలంక, సౌతాఫ్రికాలను పరిశీలిస్తోంది. ఐపీఎల్ 13 పూర్తి సీజన్‌ను బీసీసీఐ యూఏఈలోనే నిర్వహించింది. అలాగే ఐపీఎల్ 14లోని సగం సీజన్‌ను కూడా యూఏఈలోనే నిర్వహించింది. దీంతో ఈ సారి కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ ప్రాంచైజీలు మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నాయి. మొత్తానికి ఐపీఎల్ మెగా వేలం ముగిస్తే కానీ వేదికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.