Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుకీలు వల పన్నొచ్చు: 'పాండ్యా, రాహుల్‌ను సస్పెండ్‌ చేసి.. విచారణ చేపట్టాలి'

Hardik Pandya And KL Rahul Likely To Be Suspended | Oneindia Telugu
BCCI secretary Anirudh Chaudhary pushes for stronger punishment for Pandya, Rahul

హైదరాబాద్: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హర్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లపై వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే వీరిద్దపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌రాయ్‌ రెండు వన్డేల నిషేధం విధించాలని సూచించగా... మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు న్యాయపరమైన సలహా తీసుకుందామని అన్న సంగతి తెలిసిందే.

తాజాగా హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల‌పై బీసీసీఐ సెక్రటరీ అనిరుధ్ చౌదరి మండిపడ్డారు. వీరిద్దరిని సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఈమేరకు డయానా ఎడుల్జీకి రాసిన లేఖలో ఆయన కోరారు. 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ నోరు జారడం చూస్తుంటే వాళ్లను బుకీలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అనిరుధ్‌ చౌదరి అన్నారు.

ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి

ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి

"ఆ షోలో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి. వారు నోరు జారిన విధానం చూస్తుంటే అంతర్జాతీయంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్న వ్యవస్థీకృత సిండికేట్లు వలవేసి ఉచ్చులో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్సర్లు ఆటగాళ్లకు అమ్మాయిల ద్వారా ఎలా వల వేస్తారో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. టాక్‌ షోలో ఈ ఆటగాళ్ల వ్యాఖ్యలు చూస్తే వాళ్లు ఉచ్చులో పడేలాగే కనిపించారు" అని అన్నారు.

సస్పెండ్‌ చేయాలి

సస్పెండ్‌ చేయాలి

"వీరిని వెంటనే సస్పెండ్‌ చేసి.. ఆ తర్వాత విచారణ చేపట్టాలి. విచారణ పూర్తైన తర్వాతే జట్టులోకి ఎంపిక చేయాలి. నిషేధం విధించడంతో పాటు వారికి ఇలాంటి సున్నితమైన వ్యవహారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తంగా జట్టుకు, సహాయ సిబ్బందికి కూడా కౌన్సెలింగ్‌ అవసరం" అని అనిరుధ్‌ చౌదరి చెప్పాడు.

జర్నలిస్టులకు ఆంక్షలు విధిస్తూ

జర్నలిస్టులకు ఆంక్షలు విధిస్తూ

ఓవైపు ఆటగాళ్లను కలిసే విషయంలో జర్నలిస్టులకు ఆంక్షలు విధిస్తూ.. ఇలాంటి టాక్‌ షోలకు మాత్రం క్రికెటర్లను ఎలా అనుమతిస్తున్నారని అనిరుధ్‌ ప్రశ్నించాడు. ఇలాంటి షోల్లో మాట్లాడేందుకు ఆటగాళ్లు అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే ఎవరి అనుమతి తీసుకున్నారో తెలుసుకోవాలని ఆయన డయానా ఎడుల్జీకి రాసిన లేఖలో సూచించారు.

బోర్డు అనుమతి తప్పనిసరి

బోర్డు అనుమతి తప్పనిసరి

మీడియాకు ఇంటర్యూ ఇవ్వవాలంటే కచ్చితంగా బోర్డు అనుమతి తీసుకొనేలా నిబంధనలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా క్షమాపణ చెబితే సరిపోదని డయానా కూడా తేల్చిచెప్పారు. వారిపై నిషేధం వేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

వివాదాల విషయానికొస్తే

వివాదాల విషయానికొస్తే

"ఎన్నో సంవత్సరాలుగా సినిమా ప్రముఖులకు, క్రికెటర్లకు మంచి సంబంధాలున్నాయి. కానీ, వివాదాల విషయానికొస్తే మొదటి నుంచి క్రీడారంగం అందుకు దూరంగానే ఉంది. కానీ పాండ్యా, రాహుల్‌ అందుకు విరుద్ధంగా, అనుచితంగా నడుచుకున్నారు. ఆ షోలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోలేం. ఇది చాలా విచారించాల్సిన అంశం" అని ఆమె అన్నారు.

బిషన్‌ బేడీపై ఒక మ్యాచ్‌ నిషేధం

బిషన్‌ బేడీపై ఒక మ్యాచ్‌ నిషేధం

"1970ల్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టీవీ షోలో పాల్గొన్నందుకు గానూ మాజీ క్రికెటర్‌ బిషన్‌ బేడీపై ఒక మ్యాచ్‌ నిషేధం పడింది. పాండ్యా, రాహుల్‌ విషయంలో క్షమాపణలు సరిపోవు. ఇప్పుడు కూడా వీరిద్దరిపై కచ్చితంగా నిషేధం విధించాల్సిందే. ఇప్పుడు వీళ్లను క్షమిస్తే మహిళలను అవమానించినట్లవుతుంది" అని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు.

మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు

మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు

ఇదంత చూస్తుంటే... మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, కేఎల్‌ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం పడేలా కనిపిస్తోంది. దీనిపై సీఓఏ ఇంకా ఏకాభిప్రాయానికి రాకపోయినా.. వీరిపై ఏదో రూపంలో చర్యలు మాత్రం తప్పవని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఒకవేళ బీసీసీఐ నిషేధిం విధిస్తే.. పాండ్యా, రాహుల్‌ శనివారం నుంచి ఆసీస్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరమవుతారు.

Story first published: Friday, January 11, 2019, 11:07 [IST]
Other articles published on Jan 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+