Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాహా క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు.. బీసీసీఐ ఆదేశాలు.. ఎందుకో తెలుసా?!!

IND VS NZ 2020 : BCCI Ordered Wriddhiman Saha To Skip Ranji Trophy Ahead Of New Zealand Tour !
BCCI says no to Wriddhiman Saha playing Ranji Trophy ahead of New Zealand Tests

ముంబై: క్రికెట్ మ్యాచ్‌లు ఇప్పుడు ఆడొద్దంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుండి టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్ జట్టు తరఫున రంజీల్లో ఆడుతున్న సాహాను ఢిల్లీ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో ఆడొద్దని బీసీసీఐ ఆదేశించింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఉన్న కారణంగా.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడితే టెస్టుల్లో ప్రధాన కీపర్ అయిన సాహా గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ ఇలా ఆదేశాలు జారీ చేసింది.

డే/నైట్ టెస్టులో గాయం:

డే/నైట్ టెస్టులో గాయం:

నవంబర్‌లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డే/నైట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 35 ఏళ్ల సాహా కుడి చేతి ఉంగరపు వేలుకి గాయం అయింది. వేలుకి చీలిక రావడంతో ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆపై కోలుకుని రంజీల్లో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ఆడినా.. అవి టీ20, వన్డే సిరీసులే. దీంతో సాహా కోలుకోవడానికి చాలా సమయం దొరికింది.

ఇషాంత్, ధావన్ ఔట్:

ఇషాంత్, ధావన్ ఔట్:

ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన పేసర్ ఇషాంత్ శర్మ తాజాగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఇషాంత్ కాలి మడమకి తీవ్ర గాయమవడంతో న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి ఇప్పటికే తప్పుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో గబ్బర్ కూడా కివీస్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమవడంతో టీమిండియా తగు జాగ్రత్తలు తీసుకొంటోంది. ఈ క్రమంలోనే సాహాను రంజీల్లో ఆడొద్దని కోరింది.

సాహా అందుబాటులో ఉండడు:

సాహా అందుబాటులో ఉండడు:

'ఆదివారం నుండి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌కు వృద్దిమాన్ సాహా అందుబాటులో ఉండడు. బీసీసీఐ నుండి ఆడొద్దని ఆదేశాలు వచ్చాయని నేను అనుకుంటున్నా' అని బెంగాల్ కోచ్ అరుణ్ లాల్ పేరొన్నాడు. మూడో రోజే ముగిసిన రంజీ మ్యాచ్‌లో మంగళవారం బెంగాల్‌ జట్టు ఇన్నింగ్స్ 303 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది.

 షహబాజ్‌ హ్యాట్రిక్‌:

షహబాజ్‌ హ్యాట్రిక్‌:

464 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్‌ ఆడిన హైదరాబాద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 171 పరుగులకే కుప్పకూలింది. జావీద్‌ అలీ (72) ఒక్కడే పోరాడాడు. బెంగాల్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షహబాజ్‌ అహ్మద్‌ (4/26) 'హ్యాట్రిక్‌' నమోదు చేసాడు. ఇన్నింగ్స్‌ 47వ ఓవర్లో జావీద్‌ అలీ, రవి కిరణ్, సుమంత్‌లను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Wednesday, January 22, 2020, 15:11 [IST]
Other articles published on Jan 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+